రాంచరణ్ తేజ, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రముఖ కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రూస్ లీ - ది ఫైటర్’. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.
ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఈ సినిమాపై పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ పాత్రలో నటించారు. కృతి కర్బందా, నదియా ముఖ్య పాత్రలలో నటించారు.
తమిళ నటుడు అరుణ్ విజయ్ కుమార్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రానికి U సర్టిఫికెట్ వచ్చే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. మరి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇవ్వనుందో చూడాలి.
పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో ఘనంగా విడుదల చేయనున్నారు. తమిళంలో ‘బ్రూస్ లీ2’ పేరుతో విడుదల చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more