Energetic Hero Ram Latest Flick Shivam Movie Satellite Rights Has Taken Gemini TV With Huge Amount | Shivam Pre Release Business Updates

Ram shivam movie satellite rights pre release business updates

ram shivam news, ram shivam movie, shivam Satellite rights, shivam movie release updates, shivam movie business news, shivam pre release business, shivam latest photo gallery, rashi khanna news, ram with rashi khanna

Ram Shivam Movie Satellite Rights Pre Release Business Updates : Energetic Hero Ram Latest Flick Shivam Movie Satellite Rights Has Taken Gemini TV With Huge Amount.

విడుదలకు ముందే ‘శివమెత్తిన’ వ్యాపారం..

Posted: 10/01/2015 12:48 PM IST
Ram shivam movie satellite rights pre release business updates

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా నటించిన చిత్రం ‘శివమ్’. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా.. ఇంకా విడుదల కాకముందే భారీ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కడుపుబ్బా నవ్వే కామెడీ, యాక్షన్, లవ్ స్టొరీ.. ఇలా అన్నీ సమంగా ఉండే కథాంశంతో ఈ సినిమా రానుంది కాబట్టి.. శాటిలైట్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోవడంతోపాటు డిస్ట్రిబ్యూటర్స్ భారీగా కొనుగోలు చేస్తున్నారు. పైగా.. ఇటీవల ఇండస్ట్రీలో కామెడీ, లవ్ స్టోరీలు కలగలసిన సినిమాలకే ప్రాధాన్యత ఎక్కువ లభిస్తోంది కాబట్టి.. ‘శివమ్’ సినిమా ఆ ఎలిమెంట్లతో రూపొందడంతో కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు మంచి రేటుకు కొనేందుకు ముందుకొచ్చారని చెప్పుకుంటున్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ‘శివమ్’ సినిమాపై కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు శాటిలైట్ రైట్స్ కి కూడా సూపర్బ్ క్రేజ్ నెలకొంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘శివమ్’ సినిమా శాటిలైట్ రైట్స్ కి నిర్మాతలు కూడా ఊహించని రేటు రావడంతో వారు చాలా హ్యాపీగా ఉన్నారు. జెమినీ టీవీ వారు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని 5.5 కోట్లకి కొనుగోలు చేసారు. సినిమా రిలీజ్ కి ముందే శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ కి అమ్ముడు పోయి టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టడంతో ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ చాలా చాలా హ్యాపీగా వుందని పేర్కొన్నారు. ఇక ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయానికొస్తే.. వైజాగ్ లో 2.25, పశ్చిమ గోదావరిలో 1.25 కోట్లకి అమ్ముడు పోయాయి. తాజాగా వెస్ట్ గోదావరితో పాటు ఈస్ట్ గోదావరిలో కూడా 1.45 కోట్లకి శివమ్ రైట్స్ తీసుకున్నారు. దీని ప్రకారం రామ్ కి ఆంధ్ర రీజియన్ లో మంచి ఫాలోయింగ్ ఉండడమే కాకుండా తన సినిమాలు అక్కడ మంచి ప్రాఫిట్స్ ని వసూలు చేస్తున్నాయని అర్థమవుతోంది.

నిజానికి రామ్ నటించిన గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా సక్సెస్ సాధించలేదు. కానీ.. ‘శివమ్’ మంచి వసూళ్ళు చేస్తుందని నమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్స్ ఈ రేంజ్ పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. రామ్ సరసన రాశి ఖాన్న జోడీ కట్టిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivam pre release business  ram shivam Satellite rights  rashi khanna  

Other Articles