Puri Jagannadh | hot comments | auto johnny | stills | news

Puri jagannadh comments on chiranjeevi auto johnny

Puri Jagannadh latest interview, Puri Jagannadh comments, Puri Jagannadh latest updates, Puri Jagannadh stills, Puri Jagannadh talks about chiru, Puri Jagannadh news, Puri Jagannadh

Puri Jagannadh comments on chiranjeevi auto johnny: Director Puri Jagannadh hot comments on chiranjeevi 150film. Puri Jagannadh birthday special interview, stills, gallery.

నచ్చలేదని ఒక్క మాట కూడా చెప్పలేదట

Posted: 09/28/2015 12:32 PM IST
Puri jagannadh comments on chiranjeevi auto johnny

మెగాస్టార్ చిరంజీవి మాటలకు దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా బాధపడ్డాడట. చిరంజీవి హీరోగా నటించబోయే 150వ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించనున్నారని గతంలో వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి 'ఆటోజానీ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసారు చిరు.

అయితే ఈ విషయంపై పూరి అసహనం వ్యక్తం చేసారు. చిరంజీవికి స్టొరీ చెప్పినపుడు అది బాగా నచ్చిందని, సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పారు తప్ప... కథ నచ్చలేదని తనతో ఒక్క మాట కూడా చెప్పలేరని పూరి చెప్పుకొచ్చారు. సెకండ్ హాఫ్ లో ఏమైనా కరెక్షన్స్ చెప్పి వుంటే ఇంకో వర్షన్ రెడీ చేసేవాడినని, కానీ ఆయనేం మాట్లాడకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడిందంటూ పూరి తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేసారు.

అయితే చిరంజీవి మళ్ళీ పిలిస్తే అపుడు చేయడానికి రెడీగా ఉంటానన్నాడు పూరి. మరి పూరిని చిరంజీవి పిలుస్తాడా లేదో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో 'లోఫర్' సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  hot comments  auto johnny  stills  news  

Other Articles