Columbus Movie | sumanth ashwin | mishti chakraborty | seerat kapoor

Sumanth ashwin columbus movie in november first week

Columbus Movie in November first week, Columbus Movie news, Columbus Movie release date, Columbus Movie teaser, Columbus Movie posters, Columbus Movie date, Columbus Movie stills, Columbus Movie updates, Columbus Movie

Columbus Movie in November first week: Sumanth Ashwin upcoming film Columbus. This Movie will be release on November first week. misthi, seerath kapoor heroines.

విడుదలకు సిద్ధమవుతున్న సుమంత్ 'కొలంబస్'

Posted: 09/28/2015 12:16 PM IST
Sumanth ashwin columbus movie in november first week

లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం 'కొలంబస్'. 'డిస్కవరీ ఆఫ్ లవ్' అనేది ఉపశీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ఇందులో కథానాయికలు. ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ''ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరి. ఇందులో నా పాత్ర చాలా లవ్లీగా, లైవ్లీగా ఉంటుంది. ఇటు యూత్ అటు ఫ్యామిలీస్ కి నచ్చే విధంగా ఉంటుంది. మంచి నటన కనబర్చడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా తీశారు. 'కేరింత' వంటి విజయం తర్వాత నేను చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ - ''అనుకున్న విధంగా షూటింగ్ పూర్తయ్యింది. దర్శకుడు ఎంత బాగా చెప్పారో అంత బాగా తీశారు. ఇందులో సుమంత్ అశ్విన్ క్యారెక్టర్ చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. సుమంత్ అశ్విన్ సక్సెస్ పరంపరంను కొనసాగించే చిత్రం ఇది. ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. వచ్చే నెల ద్వితీయార్థంలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. నవంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Columbus Movie  sumanth ashwin  mishti chakraborty  seerat kapoor  

Other Articles