Anushka Shetty's rise from supporting actress to a bankable star

Size zero anushka to south indian super actress

Anushka Rudramadevi, Anushka Shetty, Rudramadevi, Allu Arjun, Rana Daggubati, Guna Sekhar, rudramadevi, size sero, anushka shetty, films, super

In just a few days from now Anushka Shetty’s latest big screen outing ‘Size Zero’ will arrive in theatres much to the delight of her die-hard fans.

జిలేబీలకు దూరమైన అనుష్క.. ఎందుకు..?

Posted: 09/27/2015 02:52 PM IST
Size zero anushka to south indian super actress

‘‘సౌందర్యకు జిలేబీకి విడదీయరాని సంబంధం ఉంది. జిలేబీలేని జీవితాన్ని ఊహించలేం అంటుంటుంది సౌందర్య. బరువు వంద కిలోలు పై బడినా, దానికి కారణం ఆ జిలేబీలే అని తెలిసినా పోనిలే మన జిలేబీనేగా అని వదిలేస్తుంది. అలాంటి సౌందర్య తనకు ఎంతో ఇష్టమైన జిలేబిని పక్కన పెట్టి జిమ్‌కి వెళ్లింది. స్లిమ్‌గా తయారైంది. అంతగా ఇష్టమైన జిలేబీలకు ఎందుకు దూరమైంది. ఆ త్యాగానికి కారణమేంటి అనేది తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే’’ అంటున్నారు ప్రకాశ్‌ కోవెలమూడి. అనుష్క, ఆర్య నటీనటులుగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సైజ్‌జీరో’. పివిపి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత పివిపీ మాట్లాడుతూ ‘‘వెయిట్‌లాస్‌కి సంబంధించిన కథతో రూపొందిన చిత్రమిది. ఇందులో సౌందర్య పాత్ర కోసం అనుష్క 20 కిలోలు బరువు పెరిగింది. ఆమెకు చక్కని గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది. ఆర్య పాత్ర స్టైలిష్‌గా ఉంటూ చక్కని వినోదాన్ని పంచుతుది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు, ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తోంది. అక్టోబర్‌ 9న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. సోనాల్‌ చౌహన్‌, భరత్‌, ఊర్వశి, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ త్రానికి కెమెరా: నిరవ్‌ షా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, కథ, స్ర్కీన్‌ప్లే: కనికా థిల్లాన్‌.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Shetty  rudramadevi  size zero  super  

Other Articles