Finally Actress Laya Gotry Given Clarification About Her Accident Rumours By Video Record | Tollywood Rumours

Actress laya gotry given clarification about her accident rumours

actress laya news, laya accident news, laya accident rumours, laya accident clarification, actress laya videos, actress laya updates, tollywood rumours, laya hot videos

Actress Laya Gotry Given Clarification About Her Accident Rumours : Finally Actress Laya Gotry Given Clarification About Her Accident Rumours By Video Record.

యాక్సిడెంట్ రూమర్లను కొట్టిపారేసిన నటి లయ

Posted: 09/23/2015 01:20 PM IST
Actress laya gotry given clarification about her accident rumours

తెలుగు చిత్రపరిశ్రమలోని కథానాయికల్లో మంచి పేరు గడించిన తెలుగు నటి లయ.. అమెరికాలో ప్రమాదానికి గురైనట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. లాస్ ఏంజెల్స్ నుంచి కాలిఫోర్నియా వెళ్లే దారిలో లయ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైందని.. ఈ ప్రమాదం నుంచి లయ చిన్నపాటి గాయాలతో బయటపడిందని.. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను దగ్గరలో వున్న ఆసుపత్రికి తరలించారని... ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని లయ తాజాగా వెల్లడించింది.

తాను క్షేమంగానే వున్నానని, తనకు యాక్సిడెంట్ జరగలేదని ఓ వీడియో రికార్డ్ చేసి లయ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మీడియా ప్రతినిధులకు ఓ సూచన చేసింది. ఏదైనా వార్త రాసేముందే దానిని ముందుగా వెరిఫై చేసుకోవాలని, రెస్పాన్సిబిలిటీగా వార్తలు ప్రచురించాలని కోరింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల తన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవ్వాల్సి వచ్చిందని తెలిపింది. తన క్షేమాన్ని కోరుకుంటూ తనకు ఫోన్ చేసిన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులతోపాటు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇదిలావుండగా.. స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లయ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మంచి నటిగా ఎన్నో అవార్డులు సాదించింది. గ్లామర్ రోల్స్ కన్న నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళి, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలో నటించింది. ఈమె ఎన్నారై డాక్టర్ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోనే ఉంటూ అడపాదడపా సినిమా ఫంక్షన్లలో దర్శనమిస్తుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress laya news  laya accident rumours  laya photos  

Other Articles