Sudheer babu | Bhale Manchi roju | Posters | News

Sudheer babu bhale manchi roju movie latest news

Bhale Manchi Roju Movie Latest News, Bhale Manchi Roju Movie updates, Bhale Manchi Roju Movie posters, Bhale Manchi Roju Movie stills, Sudheer babu movies, Sudheer babu movie news, Sudheer babu stills, Sudheer babu

Sudheer babu Bhale Manchi Roju Movie Latest News: Sudheer babu upcoming film Bhale Manchi Roju. Vamikha heroine. sriram aditya director. vijay kumar, shashidhar reddy producers.

భలేమంచిరోజుకి హైలెట్ కానున్న సాంగ్స్

Posted: 09/21/2015 10:34 AM IST
Sudheer babu bhale manchi roju movie latest news

ప్రేమ‌క‌థాచిత్రం', ' కృష్ణమ్మ క‌లిపింది ఇద్దరిని' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుదీర్ బాబు హీరోగా, వామిఖ ని హీరోయిన్ గా పరిచ‌యం చేస్తూ, 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆధిత్య ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'భ‌లేమంచిరోజు'. ఈచిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. ఈనెలాఖ‌రుకి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది.

ఈ సంధ‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ" సుదీర్‌బాబు,వామిఖ లు హీరోహీరోయిన్స్‌గా , శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం'భ‌లేమంచిరోజు'. ఈచిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఎక్క‌డా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న స‌బ్జెక్ట్ అనుకున్న‌ట్టుగానే తెర‌కెక్కించాం. ఈ నెలాఖ‌రుతో షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేస్తాము. ప్ర‌ముఖ న‌టుడు డైలాగ్‌కింగ్ సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈచిత్రం క‌థాంశం అంతా ఓక్క రోజులో జ‌రిగే క‌థ‌నంతో ఆద్యంతం ఆశ‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో, వినోద‌భ‌రితంగా తెర‌కెక్కుతుంది. ఈచిత్రానికి 'ఉత్త‌మ‌విల‌న్‌',' విశ్వ‌రూపం2' చిత్రాల‌కి ఛాయాగ్ర‌హ‌ణం అందించిన షామ్‌ద‌త్‌( shamdut) సినిమాటోగ్ర‌ఫి అందించారు. 'స్వామిరారా', 'ఉయ్యాల జంపాల' చిత్రాల‌కి సంగీతం అందించిన స‌న్ని.య‌మ్‌.ఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాచిత్రంలో ప్ర‌తి ఫ్రేమ్ ని గ్రాండ్ గా చిత్రీక‌రించాము. క‌థ‌, క‌థ‌నాల‌ని న‌మ్మి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాము. హీరో సుధీర్‌బాబు లుక్ విష‌యంలో కేర్ తీసుకోవ‌టమే కాక పాత్ర విష‌యంలో మ‌రింత కేర్ తీసుకున్నాము. సుధీర్‌బాబు ప‌ర‌కాయ ప్ర‌వేశం లా ఇన్‌వాల్వ్ అయ్యి మ‌రీ న‌టించారు. ఆయ‌న కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంద‌ని నమ్ముతున్నాము. ఇటీవ‌లే చిత్రీక‌రించిన సాంగ్స్ చిత్రానికి హైలెట్ గా నిల‌వ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆడియో విన్న ఆడియో కంపెనీల వారు ఉత్సాహం చూపిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆడియో డేట్ , విడుద‌ల డేట్ తెలియ‌జేస్తాము. సుధీర్‌బాబు అభిమానుల‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది" అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer babu  Bhale Manchi roju  Posters  News  

Other Articles