Nani Latest Movie Bhale Bhale Magadivoy Has Collected 22 Crores In 2 Weeks | Lavanya Tripathi News | Director Maruthi News

Bhale bhale magadivoy 2 weeks collections 22 crores nani lavanya tripathi maruthi

bhale bhale magadivoy collections, bhale bhale magadivoy movie updates, hero nani news, nani bhale bhale magadivoy, lavanya tripathi news, lavanya tripathi updates, tollywood boxoffice

Bhale Bhale Magadivoy 2 Weeks Collections 22 Crores Nani Lavanya Tripathi Maruthi : Nani Latest Movie Bhale Bhale Magadivoy Has Collected 22 Crores In 2 Weeks.

22 కోట్లు కొల్లగొట్టేసిన హీరో నాని

Posted: 09/19/2015 03:42 PM IST
Bhale bhale magadivoy 2 weeks collections 22 crores nani lavanya tripathi maruthi

అవును.. మీరు చదువుతోంది నిజమే. తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరో నాని.. 22 కోట్లు కొల్లగొట్టేశాడు. తాను నటించిన తాజా చిత్రం ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ద్వారా ఈ యువహీరో అంత మొత్తాన్ని ప్రేక్షకుల నుంచి రాబట్టుకోగలిగాడు. సెప్టెంబర్ 04వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. రెండో వారం కూడా తన జోరును కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టగలిగింది. రెండోవారం పూర్తయ్యేవవరకు ఈ సినిమా రూ.21.6 కోట్ల షేర్ రాబట్టడం విశేషంగా నిలిచింది. మూడోవారం అయ్యేసరికి రూ.25 కోట్ల షేర్ దాటడం ఖాయమని భావిస్తున్నారు. ఇక గ్రాస్ వసూళ్లు 37.2 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఏరియాల వారీగా ‘భలే భలే మగాడివోయ్’ కలెక్షన్లు చూస్తే.. తెలంగాణ (నైజాం)లో గ్రాస్ రూ.9.65 కోట్లు రాగా.. షేర్ రూ.5.85 కోట్లు వచ్చాయి. రాయలసీమ (సీడెడ్)లో రూ.2.4 కోట్ల గ్రాస్ - రూ.1.53 కోట్ల షేర్ కలెక్టయింది. ఆంధ్రాలో రూ.9.75 కోట్ల గ్రాస్.. రూ.5.82 కోట్ల షేర్ వసూలైంది. వైజాగ్ లో రూ.1.55 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.91 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.75 లక్షలు, కృష్ణాలో రూ.కోటి, గుంటూరులో రూ.1.28 కోట్లు, నెల్లూరులో రూ.33 లక్షల షేర్ వచ్చింది. ఇలా ఏపీ+తెలంగాణ కలిపి మొత్తం రూ.21.8 కోట్ల గ్రాస్ రాగా.. అందులో షేర్ రూ.13.2 కోట్లు. కర్ణాటకలోనూ ఈ సినిమా అదరగొట్టిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అక్కడ గ్రాస్ రూ.5.23 కోట్లు కాగా.. షేర్ రూ.2.23 కోట్లు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అమెరికాలో ఈ చిత్రం వసూళ్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఇప్పటిదాకా అక్కడ రూ.8.42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ రూ.5.47 కోట్లు. ఇక మిగతా ఏరియాల్లో రూ.70 లక్షల షేర్ వచ్చింది.

కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. రెండు వారాల్లో రూ.21.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ రేంజిని అందుకుంది. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రం మారుతి దర్శకత్వంలో రూపొందింది. ఇదిలావుండగా.. ‘ఈగ’ తర్వాత నాని నటించిన సినిమాలు రూ.10 కోట్ల కలెక్షన్లు కూడా చేయలేదు. కానీ.. భలే భలే మగాడివోయ్ భారీ వసూళ్లు రాబట్టి.. నానికి కోల్పోయిన స్టార్ డమ్ ని తిరిగి తెప్పించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles