Varun Tej Finally Completes His Dubbing For His Part In Kanche Movie | Pragya Jaiswal

Varun tej completes dubbing for kanche movie

varun tej, varun tej news, varun tej dubbing for kanche, kanche movie news, kanche updates, kanche news, kanche movie updates, varun tej in kanche movie, pragya jaiswal

Varun Tej Completes Dubbing For Kanche Movie : Varun Tej Finally Completes His Dubbing For His Part In Kanche Movie.

ఎట్టకేలకు వరుణ్ ఆ పని కానిచ్చేశాడు!

Posted: 09/19/2015 01:49 PM IST
Varun tej completes dubbing for kanche movie

వరుణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘కంచె’ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ గా మారిపోయింది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ చాలా అద్భుతంగా వుండటంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా.. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి, ఒక ప్రేమకథకు ముడిపెట్టి విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులు ఒక సరికొత్త అనుభూతికి లోనవుతారని సినిమా యూనిట్ చెబుతోంది. ఏదేమైనా.. ఈమధ్య విడుదలైన ట్రైలర్ ఈ సినిమా రేంజ్ ని భారీగా పెంచేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇదిలావుండగా.. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్న యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. అక్టోబర్ 2న పెద్దఎత్తున విడుదల కానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ చివరిదశకు చేరుకోగా.. వరుణ్ తేజ్ తన పార్ట్‌కు డబ్బింగ్ పూర్తి చేసేశాడు. ఇక చివరగా మిగిలిన ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో యూనిట్ నిగ్నమైంది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని యూనిట్ భావిస్తోంది. ఇక చిరంతన్ భట్ అందించిన మ్యూజిక్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తనదైన మార్క్ సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న క్రిష్, ఈ సినిమా ద్వారా అందరినీ ఆశ్చర్యపరచే కథతో రానున్నారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej  kanche movie  pragya jaiswal  

Other Articles