Kamal Hassan | Cheekati Rajyam | Trisha | Latest Poster Release Date | Posters

Kamal hassan cheekati rajyam movie new poster release date

Kamal Hassan Cheekati Rajyam Latest Poster Release Date, Kamal Hassan Cheekati Rajyam, Kamal Hassan Cheekati Rajyam Movie Latest Updates, Kamal Hassan Cheekati Rajyam Movie news, Kamal Hassan Cheekati Rajyam Movie updates, Kamal Hassan Cheekati Rajyam Movie details, Kamal Hassan Cheekati Rajyam Movie posters, Kamal Hassan Cheekati Rajyam Movie stills, Kamal Hassan, Cheekati Rajyam

Kamal Hassan Cheekati Rajyam Movie New Poster Release Date: Tamil star hero Kamal Hassan upcoming film Cheekati Rajyam. Trisha heroine. madhushalini acts in key role. Rajesh Director.

రేపే చీకటిరాజ్యం కొత్త పోస్టర్ విడుదల

Posted: 09/03/2015 02:00 PM IST
Kamal hassan cheekati rajyam movie new poster release date

‘ఉత్తమ విలన్’, ‘పాపనాశం’ చిత్రాల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తూంగవనం’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘చీకటి రాజ్యం’ పేరుతో విడుదల చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మిస్తున్నారు.

హైదరాబాద్, చెన్నైలోని పలు అందమైన ప్రదేశాల్లో కేవలం 40 రోజుల్లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కమల్ ఈ సినిమాకు కథ-కథనాలను అందించడంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నారు.

ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. నటి మధుశాలిని ఓ కీలక పాత్రలో నటిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

సెప్టెంబర్ 4న ‘చీకటి రాజ్యం’ సినిమాకు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను సెప్టెంబర్ 4న చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  Cheekati Rajyam  Trisha  Latest Poster Release Date  Posters  

Other Articles