‘చందమామ కథలు’ చిత్రంతో దర్శకుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై రాజ్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. సిద్ధు, రాష్మీగౌతం, శ్రద్ధదాస్, నరేష్ విజయ్ కృష్ణ, మహేష్ మంజ్రేకర్, రాజా రవీంద్ర, స్నిగ్ధ, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విభిన్నమైన కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.
త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి నృత్యాలు: గణేష్ మాస్టర్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, చాయాగ్రహణం: రామ్ రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, నిర్మాణం: ఆర్.కె.స్టూడియోస్, నిర్మాత: రాజ్ కుమార్.ఎం, రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more