Chiranjeevi | Clarifies | Puri Jagannath | Auto Johnny

Megastar chiranjeevi clarifies on puri jagannath film

Megastar Chiranjeevi clarifies on Puri Jagannath Auto Johnny, Megastar Chiranjeevi clarifies on Puri Jagannath, Chiranjeevi clarifies on Puri Auto Johnny, Chiranjeevi latest stills, Chiranjeevi latest interview, Chiranjeevi movie news, Chiranjeevi latest updates, Chiranjeevi latest photoshoot, Chiranjeevi photoshoot, Chiranjeevi movie details, Chiranjeevi

Megastar Chiranjeevi clarifies on Puri Jagannath film: Megastar Chiranjeevi clarifies on his 150th film under director Puri Jagannath. this film title Auto Johnny. Ram charan producer.

అటకెక్కిన ఆటోజానీ... మళ్లీ కథల వేటలో మెగాస్టార్!

Posted: 08/19/2015 11:06 AM IST
Megastar chiranjeevi clarifies on puri jagannath film

ఇప్పటి వరకు 149 చిత్రాల్లో నటించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి... తన 150వ చిత్రం ఎప్పుడు మొదలుపెడతాడో అని అభిమానులు గతకొద్ది కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా తన 150వ సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తునే వున్నాయి. కానీ ఈ ఆశలపై మెగాస్టార్ నీళ్లు చల్లేసాడు.

చిరంజీవి 150వ సినిమాను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనుందని, ఈ చిత్రానికి ‘ఆటోజానీ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని చిరు తనయుడు రాంచరణ్ మరియు దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఖరారు చేసారు. అయితే ‘ఆటోజానీ’ కి సంబంధించిన ఫస్ట్ హాఫ్ పూర్తయ్యిందని, కానీ సెకండ్ హాఫ్ ను మరింత పవర్ ఫుల్ గా సిద్ధం చేయాలని తాను ప్రయత్నిస్తున్న పూరీ తెలియజేసారు. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లుగా చిరు తాజాగా చెప్పుకొచ్చాడు.

చిరంజీవి ఇటీవలే ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన 150వ సినిమా గురించి మాట్లాడుతూ.,... పూరీ చెప్పిన కథ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బాగుంటుందనే వుద్దేశ్యంతో ఆగిపోయాం. ఈలోపు పూరీ మరో సినిమాతో బిజీ అయ్యారు. అలాగే ఇంకా కొన్ని కథలు వింటున్నాను. ఆ కథల్లో ఏదైనా మంచి కథ దొరికితే మరో రెండు నెలల్లో ప్రారంభం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి చిరు చెప్పిన ప్రకారం ‘ఆటోజానీ’ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే పూరీ ప్రస్తుతం వరుణ్ తేజతో ‘లోఫర్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మరో రెండు, మూడు నెలల తర్వాత విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత పూరీ ‘ఆటోజానీ’ గురించి ఆలోచించినా కూడా... ఈలోపే చిరుకి నచ్చే విధంగా మరో దర్శకుడు లేదా రచయితలు కథను సిద్ధం చేస్తే... పూరీ ‘ఆటోజానీ’ అటకెక్కేసినట్లే అవుతుంది. మరి ఏం జరుగనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Clarifies  Puri Jagannath  Auto Johnny  stills  

Other Articles