Kanche | First Look | Teaser | Varun Tej | Krish | Stills

Varun tej kanche first look teaser

Kanche Movie First Look Teaser, Kanche Movie First Look, Kanche Movie News, Kanche Movie Updates, Kanche Movie Stills, Kanche Movie Details, Varun Tej Movie News, Varun Tej Movie updates, Varun Tej latest news, Varun Tej Latest Stills, Varun Tej

Varun Tej Kanche First Look Teaser: Kanche is a period drama with a beautiful love story featuring the handsome young lad from the Mega Family, Varun Tej, as the hero and directed by the critically and commercially acclaimed director Krish Jagarlamudi.

వరుణ్ ‘కంచె’ ఫస్ట్ లుక్ టీజర్

Posted: 08/15/2015 02:53 PM IST
Varun tej kanche first look teaser

‘గమ్యం’, ‘వేదం’ వంటి పలు హిట్ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మెగాహీరో వరుణ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం ‘కంచె’. ఈ చిత్రంలో వరుణ్ సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో యుద్ధ సన్నివేశాలలో వరుణ్ ఓ సైనికుడిగా కనిపించాడు.

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు .

'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Varun Tej  Kanche  First Look  Teaser  Stills  

Other Articles