Jr Ntr And Sukumar Combo Movie First Look Poster Will Release On August 15 | Tollywood

Jr ntr sukumar movie first look poster august 15 release

jr ntr news, jr ntr new movie, jr ntr new stills, jr ntr beard stills, jr ntr new looks, jr ntr sukumar movie, jr ntr sukumar first look, jr ntr rakul preet singh, rakul preet singh news, rakul preet controversy, rakul preet latest updates

Jr Ntr Sukumar Movie First Look Poster August 15 Release : According to tollywood sources.. Jr Ntr And Sukumar Combo Movie First Look Poster Will Release On August 15.

అభిమానులకు యంగ్ టైగర్ స్పెషల్ గిఫ్ట్

Posted: 08/11/2015 07:07 PM IST
Jr ntr sukumar movie first look poster august 15 release

ఇండస్ట్రీలో వున్న స్టార్ హీరోలందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతమేర వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ అభిమాన నటుడి సినిమా విడుదలవుతుందంటే చాలు.. ఆ రోజంతా పండగలా సంబరాలు జరుపుకుంటారు. థియేటర్ల దగ్గర ఉదయం నుంచి టికెట్ల కోసం పాగా వేసుకుని కూర్చుంటారు. ఆ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంతగా తమ హీరోలను ఫ్యాన్స్ ఆదరిస్తారు. ఈ విధంగా తమని ఆదరించే అభిమానుల కోసం హీరోలు అప్పుడప్పుడు వారిని తమదైన రీతిలో సంతోష పెడుతుంటారు. ఆ తరహాలోనే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేయనున్నాడని సమాచారం.

ఇంతకీ ఎన్టీఆర్ ఇవ్వనున్న ఆ కానుకేంటి..? అది ఎప్పుడు ఇవ్వబోతున్నాడు..? అని అనుకుంటున్నారు. ఆ గిఫ్ట్ ఏమిటంటే.. ఎన్టీఆర్ తన తాజా చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్ స్టిల్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసి... ఫ్యాన్స్ ను సంతోషపెట్టనున్నాడని ఫిలింనగర్ న్యూస్. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే! ‘నాన్నకి ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలనలో వున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ స్టిల్ నే ఆగస్టు 15 సందర్భంగా తన అభిమానులకు గిఫ్టుగా రిలీజ్ చేయనున్నాడు. ఆ స్టిల్ లో ఎన్టీఆర్ గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.

ఇప్పటికే ఎన్టీఆర్ డిఫరెంట్ హెయిర్ స్టైల్, గెడ్డంతో కనిపించాడు. కానీ.. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో మాత్రం మరింత స్పెషల్ గా కనువిందు చేయనున్నాడు. ‘టెంపర్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కొత్త సినిమాలో నటిస్తుండటంతో.. ఆ మూవీ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు మరోమారు సన్నద్ధమవుతున్నాడన్నమాట.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr new movie first look  sukumar  rakul preet singh  

Other Articles