Akkineni Akhil Debut Movie Nizam Rights Sold With Huge Amount | VV Vinayak | Hero Nitin

Akkineni akhil vv vinayak movie nizam rights sold with huge amount

akkineni akhil debut, akhil debut movie, akhil debut movie nizam rights, akhil movie nizam rights, hero nitin news, akkineni nikhil updates, vv vinayak news, akhil vinayak movie, sayesha saigal

Akkineni Akhil VV Vinayak Movie Nizam Rights Sold With Huge Amount : Akkineni Akhil Debut Movie Nizam Rights Sold By Devi Films Srinivas With Huge Amount 13 Crores.

అఖిల్ రేంజ్ ఏంటో.. నైజాం రైట్స్ తేల్చేశాయి!

Posted: 07/25/2015 05:40 PM IST
Akkineni akhil vv vinayak movie nizam rights sold with huge amount

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్.. కేవలం తన స్టైలిష్ లుక్స్ తో రెండు తెలుగురాష్ట్రాలోనూ భారీ స్థాయిలో అభిమానుల్ని కైవసం చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఏదో ఒక ఫంక్షన్లో కనిపిస్తూ.. తన ఇమేజ్ ని పెంచుకుంటూ వచ్చాడు. ఇక ‘మనం’ సినిమాలో ఒక చిన్న రోల్ లో నటించి చమత్కరించిన అఖిల్ క్రేజ్ నానాటికీ మరింత పెరుగుతూ వస్తోంది. ఇతనికి వున్న క్రేజ్.. తాను తాజాగా నటిస్తున్న చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇతని రేంజ్ ఏంటో.. ఇంకా విడుదల కాని తాజా చిత్రం నైజాం రైట్స్ తేల్చేశాయి. ఎవరూ ఊహించని భారీ స్థాయిలో అఖిల్ తాజా చిత్రం నైజాం రైట్స్ అమ్ముడుపోయాయి.

అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇంకా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నైజాం రైట్స్ తాజాగా భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ సినిమా నైజామ్ ప్రదర్శన హక్కులు ఏకంగా రూ.13 కోట్లకి అమ్ముడుపోయాయంటే.. నిఖిల్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ప్రదర్శన హక్కుల్ని దేవీ ఫిలిమ్స్ శ్రీనివాస్ దక్కించుకున్నాడు. ఇది అఖిల్ మొదటి సినిమానే అయినప్పటికీ.. అగ్రకథానాయకుల సినిమాల రేంజ్ లో బిజినెస్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యిందని సమాచారం. దాదాపు విదేశాల్లోనే ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంది. ఇటీవలే అఖిల్ కి సంబంధించిన టీజర్, కొంతభాగం మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఆ రెండు వీడియోలకు భారీ స్పందన లభించింది. ఈ సినిమా మీద పెరుగుతున్న అంచనాలను లెక్కిస్తుంటే.. ఖచ్చితంగా భారీ విజయం అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkhineni akhil debut  director vv vinayak  sayesha saigal  

Other Articles