Stylish Star Allu Arjun Allu Arjun Bags MAA Award As Best Actor | Race Gurram | SO Satyamurthy

Allu arjun bags maa award as best actor race gurram so satyamurthy

allu arjun, cinemaa awards, allu arjun bags maa award, allu arjun best actor, allu arjun filmfare award, allu arjun latest news, allu arjun cinemaa function, CineMaa Awards Function

Allu Arjun Bags MAA Award As Best Actor Race Gurram SO Satyamurthy : Stylish Star Allu Arjun Allu Arjun Bags MAA Award As Best Actor For Race Gurram and Son Of Satyamurthy Movies.

సిని‘మా’ ఈవెంట్ లో బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్

Posted: 07/25/2015 03:19 PM IST
Allu arjun bags maa award as best actor race gurram so satyamurthy

తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరో ఎవరు? అని గతకొన్నాళ్ల నుంచి చక్కర్లు కొడుతున్న ప్రశ్నకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెక్ పెట్టాడు. అదెలా అంటారా..? బన్నీ నటించిన ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఆ రెండింటిలో ముఖ్యంగా ‘రేసుగుర్రం’ చిత్రం బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాదాపు రూ.60 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి.. టాలీవుడ్ టాప్ గ్రాసెస్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు.. ఈ సినిమా అతనికి నటుడిగా ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న బన్నీ.. ఆ తరహాలోనే మరో అరుదైన అవార్డు అతనిని వరించింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా సిని‘మా’ అవార్డుల ఫంక్షన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2004 నుంచి ప్రారంభమైన ఈ అవార్డు ప్రదానం ఈవెంట్ ఈ ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని నోవాటెల్ లో వైభవంగా జరిగిన ఈ అవార్డు ఫంక్షన్ లో గతేడాది సినిమాల ఆధారంగా అద్భుత పెర్ఫార్మెన్స్ ప్రదర్శించిన నటీనటులకు అరుదైన అవార్డులు వరించాయి. అందులో అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా అవార్డు లభించింది. ఈ అవార్డు లభించినందుకుగాను తనకెంతో ఆనందంగా వుందని హర్షం వ్యక్తం చేశాడు. ఈ విధంగా బెస్ట్ యాక్టర్ గా రెండు అవార్డులు అందుకున్న బన్నీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తన పేరును ముద్రించుకున్నాడు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా త్వరలోనే రూపొందుకోనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  cinemaa awards  telugu best actor  

Other Articles