Mahesh Babu | Koratala Shiva | Srimanthudu

Director koratala shiva clarifies on srimanthudu movie special show

Koratala Shiva clarifies on Srimanthudu Special Show, Srimanthudu Theatrical Trailer, Srimanthudu Audio Launch, Srimanthudu Audio release, Srimanthudu Audio songs, Srimanthudu Audio details, Srimanthudu Audio launch updates, Srimanthudu Audio launch stills, Srimanthudu movie songs, Srimanthudu songs released, Srimanthudu

Director Koratala Shiva clarifies on Srimanthudu Movie Special Show: Koratala shiva Srimanthudu movie will be release on 7th August. Mahesh Babu, Shruti Haasan acts in lead roles. Devi Sri Prasad Music.

‘శ్రీమంతుడు’ స్పెషల్ షోపై కొరటాల శివ క్లారిటీ

Posted: 07/23/2015 04:25 PM IST
Director koratala shiva clarifies on srimanthudu movie special show

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు మరియు కె.చంద్రశేఖర్ రావు గార్లకు, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక షో వేసి చూపించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా కొద్దిరోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందించింది. ఈ విషయంపై దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... ప్రధానమంత్రి మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ప్రత్యేక షో వేయాలని మేమింకా అనుకోలేదు. ఓ ఎన్నారై ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఎలా డెవలప్ చేసాడు అనే ఒక పాయింట్ తో సాగుతుంది. అందుకే ఈ పాయింట్ ను అందరికీ చేరువయ్యేలా ఒకసారి పలు రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్స్ కు చూపించాలని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఎవరిని కూడా సంప్రదించలేదు. ఒకవేళ ఎవరినైనా సంప్రదించినా కూడా దాదాపు 90% సినిమా విడుదలయ్యాకే ప్రత్యేక షో వేసే అవకాశం వుంది. ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చాక త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేస్తామని అన్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ స్పందన వస్తుంది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సుకన్య, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Koratala Shiva  clarifies Srimanthudu  Special Show  

Other Articles