Bajrangi Bhaijaan Inspired from Chiranjeevi Film

Bajrangi bhaijaan inspired from chiranjeevi film

Bajrangi Bhaijaan inspired chiru film Bajrangi Bhaijaan latest news, Bajrangi Bhaijaan movie news, Bajrangi Bhaijaan movie collections, Bajrangi Bhaijaan stills, Bajrangi Bhaijaan records, Bajrangi Bhaijaan first week collections, Bajrangi Bhaijaan trailers, Bajrangi Bhaijaan

Bajrangi Bhaijaan Inspired from Chiranjeevi Film: Salman Khan latest block buster hit film Bajrangi Bhaijaan. Bajrangi Bhaijaan movie news, records, collections, stills, trailers, gallery

చిరు పసివాడే ‘భజ్రంగీ భైజాన్’కు మూలం

Posted: 07/22/2015 04:11 PM IST
Bajrangi bhaijaan inspired from chiranjeevi film

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘భజ్రంగీ భైజాన్’. ఈ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సీఫీస్ ను కలెక్షన్లతో మోత మోగిస్తుంది. విడుదలైన కొద్దిరోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన క్షణం నుంచి ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం తరహాలోనే ‘భజ్రంగీ భైజాన్’ చిత్రం వుండబోతుందని అందరూ కామెంట్ చేసారు. ‘భజ్రంగీ భైజాన్’ విడుదలైన తర్వాత ఆ కామెంట్లు మరింత ఎక్కువయ్యాయి. కానీ ఇదే విషయంపై రచయిత విజయేంద్రప్రసాద్ కూడా స్పష్టం చేసాడు.

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ... చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో నన్ను బాగా కదిలించింది. ఆ చిత్రాన్ని పూర్తి మార్చులు, చేర్పులతో కాంటెంపరరీ టచ్ ఇచ్చి చేయాలనుకున్నానని, కానీ ఈలోగా తాను ఓ పాకిస్థానీ జంట తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం అక్కడ ఖర్చుకు భరించలేక ఇండియాకు వచ్చి ఆపరేషన్ చేయించుకున్నట్లుగా మీడియాలో వార్త చూసానని.. అందుకే ఆ కథను సిద్ధం చేసానని అన్నారు.

ఏదేమైనా కూడా ‘భజ్రంగీ భైజాన్’ చిత్రం బాలీవుడ్ లో రికార్డుల మోత మ్రోగిస్తుంది. సల్మాన్ సినిమాలో వుండే భారీ యాక్షన్, డాన్సులు వంటివి ఈ సినిమాలో లేకపోయినప్పటికీ... ఈ సినిమా మాత్రం అందరికీ తెగ నచ్చేస్తుంది. పాజిటివ్ టాక్ తో అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో నడుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrangi Bhaijaan  Inspired  Salman khan  Chiranjeevi  Pasivadi pranam  

Other Articles