Actress Priyamani revealed her love affair

Actress priyamani revealed her love affair

Priyamani latest news, Priyamani interview, Priyamani love affair, Priyamani reveales, Priyamani hot news, Priyamani hot stills, Priyamani latest stills, Priyamani latest updates, Priyamani news, Priyamani movies, Priyamani movie updates, Priyamani

Actress Priyamani revealed her love affair: Kannada hot actress Priyamani has revealed the interesting details about her love life and marriage. Priyamani latest news, movies, gossips, love, stills, affair, hot stills, gallery.

ప్రియమణి అతనితో సహజీవనం చేస్తుందట!

Posted: 07/14/2015 03:19 PM IST
Actress priyamani revealed her love affair

మొన్నటి వరకు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ స్టార్, అగ్ర హీరోల సరసన నటించిన బ్లాక్ బ్యూటీ ప్రియమణి.. గతకొద్ది కాలంగా తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఈ అమ్మడికి టాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోవడంతో తన సొంత గూటికి చేరిపోయింది. కన్నడంలో ఈ అమ్మడు అడపదడపా సినిమాల్లో నటిస్తూ, అక్కడ ఓ ఛానెల్లో ప్రసారమయ్యే డాన్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తుంది.

అయితే ఈ అమ్మడి సినిమా విషయాలు కాస్త పక్కనపెడితే... ప్రియమణి ఎట్టకేలకు తన లవ్ స్టోరీని బయటపెట్టేసింది. గతకొద్ది కాలంగా ప్రియమణి ఎవరితోనే ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ రకరకాల వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలకు స్వయంగా ప్రియమణియే స్వస్తిపలికింది.

తాను ముస్తాఫా రాజ్ అనే వ్యక్తితో ప్రేమలో వున్నట్లు ప్రియమణి తెలిపింది. ఇంకా తన ప్రేమ కబుర్లు చెబుతూ... ముంబైలో రాజ్ పెద్ద ఈవెంట్ మేనేజర్ అని, సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో తనతో పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాము మంచి స్నేహితులుగా వున్నామని, కానీ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమలో పడ్డామని, అయితే తానే ముందుగా ప్రపోజ్ చేసానని, ఆ తర్వాత అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని చెబుతోంది.

అయితే ఇరుకుటుంబ సభ్యుల నుంచి కూడా అమోదం లభించిందని, కానీ ఇప్పట్లో తమ పెళ్లి లేకపోయినప్పటికీ, ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నామని ప్రియమణి స్పష్టం చేసింది. మొత్తానికి ప్రియమణి పెళ్లి వార్త చెప్పకుండానే ప్రేమ విషయాలు చెప్పేసింది. మరి వీరి సహజీవనం పెళ్లి వరకు వెళ్తుందో లేక మధ్యలోనే ఆగిపోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyamani  Reveales  love  affair  hot news  stills  

Other Articles