Allari Naresh James Bond Movie Again Postponed

Allari naresh james bond movie again postponed

Allari Naresh James Bond Movie Release date, Allari Naresh James Bond Movie news, Allari Naresh James Bond Movie latest posters, Allari Naresh James Bond Movie stills, Allari Naresh James Bond Movie posters, Allari Naresh James Bond Movie trailers, Allari Naresh James Bond Movie songs, Allari Naresh James Bond

Allari Naresh James Bond Movie Again Postponed: Allari naresh upcoming film James bond again postpone. sakshi choudary heroine. this film will be release on 24 july.

అల్లరోడి జేమ్స్ బాండ్ విడుదలకు మళ్లీ బ్రేక్

Posted: 07/13/2015 11:44 AM IST
Allari naresh james bond movie again postponed

అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్’. ఈ చిత్రం గతకొద్ది రోజులుగా  వాయిదా మీద వాయిదా పడుతూ వస్తోంది. నరేష్ నటించిన ‘జేమ్స్ బాండ్ - నేను కాదు నా పెళ్లాం’ సినిమా గత నెల 26 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసారు. ఆ తర్వాత జులై 17న విడుదల చేయబోతున్నట్లు అల్లరి నరేష్ ప్రకటించాడు.

కానీ జులై 10న విడుదలైన ‘బాహుబలి’ అన్ని థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కాబట్టి కొత్త సినిమాలు, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమవుతోంది. దీంతో ఈ సమస్య వల్ల ‘జేమ్స్ బాండ్’ చిత్రాన్ని జులై 24కు వాయిదా వేసారు. జులై 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తుంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నరేష్ భార్యగా సాక్షి చౌదరి లేడీ మాఫియా డాన్ పాత్రలో నటించింది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  James Bond  Release Date  Trailer  

Other Articles