People taking selfies at cremation disgusts Amitabh Bachchan

Amitabh bachchan disgusting to take selfies at cremation

amitabh bachchan, actor amitabh bachchan, amitabh bachchan movies, amitabh bachchan selfies, selfies at cremation, amitabh bachchan news, amitabh bachchan upcoming films, entertainment news, amitabh bachchan news, Big B news, facebook

Amitabh Bachchan was left disgusted by the insensitivity of people who were crowding around him and taking selfies while he attended the cremation of his friend

శాంతిమూర్తి బిగ్ బికి ఒళ్లు మండేలా చేసిందెవరు..?

Posted: 07/05/2015 01:08 PM IST
Amitabh bachchan disgusting to take selfies at cremation

నిత్యం శాంతిమూర్తిలా కనిపించే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. ఎప్పుడు తన హావభావాలను, తన మనస్సు పడుతున్న అన్ని సంతోషాలను, విషాధాలను, కలచివేసే అంశాలను ఎప్పటికప్పుడు తన అశేష అభిమానులతో పంచుకుంటారు. తన తోటి నటీనటుల తరహాలో కాకుండా.. ఇప్పటికీ చెక్కుచెదరని స్టార్ డమ్ కలిగిన వ్యక్తి అబితామ్ అంటే అతిశయోక్తి కాదు. సామాజిక మాద్యమంలో తనను నిత్యం ఫాలో అవుతున్న ఫాలోవర్స్ సంఖ్య అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. అయితే హఠాత్తుగా ఆయన తాజాగా చేసిన ట్విట్.. చూసి ఆయన ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే నిజంగా కొత్త పుంతలు తొక్కుతున్న సెల్పీలు.. సమాజాంలో దిగజారుతున్న మానవ విలువకు అది దర్పణం పడుతుంది.

జనాలకు రోజురోజుకూ సెలీ ల పిచ్చి పెరిగిపోతోందని, ఆఖరికి శవంతో కూడా సెల్ఫీ తీసుకునే దౌర్భగ్యా పరిస్థితి వచ్చిందని, ఆయన తన అవేదనను వ్యక్తం చేశారు. తన స్నేహితుడు పరమపదించడంతో ఆతని అంత్యక్రియలు తాను హాజరయ్యానని, అయితే అక్కడ తనతో కొందరు సెల్పీలు కావాలంటూ అతని వెంట పడటం, అతని పక్కకు వచ్చిన సెల్పీల కోసం ఎగబటడం తనకు చికాకు తెప్పించిందని అమితాబ్ అగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తి పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ఇలా చేయడం సబబుకాదన్నారు. అంతేకాదు నటుడూ అయినంత మాత్రన ఏమాత్రం గోప్ప విషయం కాదని, మానవీయ విలువలు కలిగి వుంటడమే గొప్ప విషయమని అమితాబ్ అన్నారు. ‘‘జనాలకు చనిపోయిన వారన్నా, బతికున్న వారన్నా గౌరవం లేకపోవడం దురదృష్టకరం’’ అని బిగ్‌బీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Selfies  disgusts  facebook  

Other Articles