Actress Keerthi Suresh says no to glamour roles

Actress keerthi suresh says no to glamour roles

Keerthi Suresh glamour roles, Keerthi Suresh movies, Keerthi Suresh movie news, Keerthi Suresh latest news, Keerthi Suresh news, Keerthi Suresh latest updates, Keerthi Suresh details, Keerthi Suresh news, Keerthi Suresh

Actress Keerthi Suresh says no to glamour roles: Actress Keerthi Suresh says no to glamour roles and liplocks, bikini etc. Keerthi Suresh latest news, stills, gallery.

అందాలు చూపించనంటున్న మేనక కూతురు

Posted: 07/01/2015 12:27 PM IST
Actress keerthi suresh says no to glamour roles

ఏ మోడల్ అయినా కూడా హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదట్లో తాను గ్లామర్ పాత్రలకు దూరం అంటూ భారీ కామెంట్లు చేస్తుంటారు. కానీ రెండు సినిమాలు చేయగానే కాస్త రెమ్యునరేషన్ పెంచేయడం, దాంతో సినిమా ఆఫర్లు తగ్గిపోతుండటం వల్ల గ్లామర్ పాత్రలే కాకుండా లిప్ లాక్ లకు, బికినీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

ఒకప్పుడు ఇలా గ్లామర్ పాత్రలకు దూరమని చెప్పిన భామలే ఇపుడు బికినీలు, లిప్ లాక్ సన్నివేశాలలో నటిస్తూ తెగ అందాల ఆరబోతతో కనువిందు చేస్తున్నారు. అయితే ఇలాంటి జాబితాలోకి కొత్తగా వచ్చిన కీర్తి సురేష్ కూడా ఇలాంటి మాటలే చెబుతోంది.

ప్రముఖ సీనియర్ నటి మేనక కూతురైన కీర్తిసురేష్ ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. తమిళంలో ఈ అమ్మడు నటించిన చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. లుక్స్ పరంగా కీర్తికి మంచి మార్కులే పడటంతో కోలీవుడ్ దర్శకనిర్మాతలు ఈ అమ్మడిపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు.

అయితే ఈ అమ్మడు మాత్రం గ్లామర్ పాత్రలకు తాను వ్యతిరేఖి అని చెబుతోంది. గ్లామర్, లిప్ లాక్, బికినీ వంటి పాత్రలలో ఎప్పటికీ నటించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పేస్తుంది. విజయ్, అజిత్ వంటి ఎంత పెద్ద స్టార్ హీరోలైనా సరే... గ్లామర్ పాత్రల్లో నటించనని కరాఖండిగా చెప్పేస్తుంది. మరి ఈ అమ్మడు భవిష్యత్తులో గ్లామర్ పాత్రలలో నటిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Keerthi Suresh  glamour roles  movie news  hot stills  

Other Articles