Nikhil Shankarabharanam movie shooting updates

Nikhil shankarabharanam movie shooting updates

Nikhil Shankarabharanam movie shooting details, Shankarabharanam movie first look poster, Shankarabharanam movie first look, Nikhil Shankarabharanam movie news, Nikhil Shankarabharanam movie updates, Nikhil Shankarabharanam stills, Nikhil Shankarabharanam posters, Nikhil Shankarabharanam first looks

Nikhil Shankarabharanam movie shooting updates: Actor nikhil latest film Shankarabharanam. This movie first look poster released. Uday Nandanavanam director. kona venkat writer.

శంకరాభరణం కోసం నిఖిల్ భారీ సాహసాలు

Posted: 06/24/2015 10:03 AM IST
Nikhil shankarabharanam movie shooting updates

‘హ్యాపీడేస్’ తర్వాత చాలా ఫ్లాపులు చూసిన హీరో నిఖిల్..  ‘స్వామిరారా’ చిత్రంతో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ వంటి హిట్ చిత్రాల తర్వాత నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. టైటిల్ చూడటానికే క్లాస్.. కానీ లోపలంతా క్రైం కామెడీయే అని అంటున్నారు చిత్ర యూనిట్.

MVV సినిమా బ్యానర్ పై నిర్మాత ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమయ్యింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బోర్, నగరి, వాయ్ అనే ప్రాంతాల్లో జరుగుతోంది. ఇవి పూణేకు 60కిలో మీటర్ల దూరంలో వున్నాయి. ఆ ప్రాంతంలో మనుషులు కూడా వెళ్లడానికి సాహసం చేయలేని కొన్ని రిస్కీ ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నారు. నిఖిల్ ఏ మాత్రం భయపడకుండా చేస్తున్నాడట. నిఖిల్ డెడికేషన్ చూసి ఈ చిత్ర రచయిత, నిర్మాత అయినటువంటి కోన వెంకట్ నిఖిల్ ను ప్రశంసించారు.

ఇక నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తుంది. క్రైం కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Shankarabharanam  shooting  First look  Stills  

Other Articles