Vidya Balan talks about her films

Hot actress vidya balan talks about her films

Vidya Balan latest news, Vidya Balan interview, Vidya Balan latest interview, Vidya Balan movie news, Vidya Balan movie updates, Vidya Balan stills, Vidya Balan hot stills, Vidya Balan posters, Vidya Balan hot

Hot Actress Vidya Balan talks about her films: bollywood star hot actress Vidya Balan talks about her films. Vidya Balan latest news, movies, gossips, stills, gallery.

వాళ్లే ముఖ్యమంటున్న డర్టీ పిక్చర్ భామ

Posted: 06/09/2015 10:52 AM IST
Hot actress vidya balan talks about her films

హిందీలో నటిగా విద్యాబాలన్ ఎన్ని చిత్రాలు చేసిన రాని గుర్తింపు ఒక్క అడల్ట్ పాత్రలో నటించేసరికి ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా భారీ గుర్తింపును దక్కించుకుంది. విద్యాబాలన్ గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు, క్రేజ్ రాలేకపోయింది. కానీ విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ లో నటించడంతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాలో విద్యాబాలన్ చేసిన అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రముఖ సినీ నటి సిల్క్ స్మిత జీవితగాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను దక్కించుకుంది. ఈ చిత్రం తర్వాత విద్యాబాలన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

‘డర్టీ పిక్చర్’ తర్వాత విద్యాబాలన్ నటించిన పలు చిత్రాలు మంచి విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే ఈ అమ్మడికి ఈమధ్య వరుస అవకాశాలు వచ్చిపడుతున్నప్పటికీ తనకు స్టార్ స్టేటస్ పైన, టాప్ 1 స్థానంపైన ఆసక్తి లేదని చెబుతోంది. తనకు కేవలం ప్రేక్షకుల అభిమానమే ముఖ్యమని, వాళ్లను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేస్తానని చెబుతోంది.

ఇంకా తన సినిమాల గురించి చెబుతూ... ఏ సినిమాలోనైనా తన పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి తనవంతు కృషి తాను చేస్తానని, కాని అది కూడా పరిధి మేరకేనని చెబుతోంది. అయితే కొన్ని సినిమాలు హిట్టవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. కానీ వాటి ప్రభావం తన తరువాతి చిత్రాల మీద వుండదని అంటోంది. ఎందుకంటే సినిమా ఫెయిల్ అయినా కూడా నటిగా తాను మాత్రం ఫెయిల్ కాలేదంటున్నారు. అయితే తాను ఎవరికీ పోటీ కాదని, తనకు ఎవరూ పోటీ కాదని... తనకు తానే పోటీ అంటూ విద్యాబాలన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vidya Balan  interviews  movie news  hot stills  

Other Articles