Mellagaa Thattindi Manasu Talupu Movie Trailer Launch

Mellagaa thattindi manasu talupu movie trailer launch

Mellagaa Thattindi Manasu Talupu Trailer Launch, Mellagaa Thattindi Manasu Talupu movie news, Mellagaa Thattindi Manasu Talupu stills, Mellagaa Thattindi Manasu Talupu posters, Mellagaa Thattindi Manasu Talupu trailer, Mellagaa Thattindi Manasu Talupu videos, Mellagaa Thattindi Manasu Talupu songs, Mellagaa Thattindi Manasu Talupu audio, Mellagaa Thattindi Manasu Talupu teasers, Mellagaa Thattindi Manasu Talupu

Mellagaa Thattindi Manasu Talupu Movie Trailer Launch: Director Vamsi latest film Mellagaa Thattindi Manasu Talupu. This film Trailer Launched. Ajmal, nikhitha narayanan acts in lead roles.

మొన్న వెళ్లింది.. ఇప్పుడు తలుపు తట్టింది!

Posted: 06/09/2015 09:38 AM IST
Mellagaa thattindi manasu talupu movie trailer launch

విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు వంశీ. ఎంతమంది కొత్త దర్శకులు వచ్చినా, కాలం మారినా కూడా దర్శకుడు వంశీ తనదైన శైలిలో మాత్రమే సినిమాలు తీస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఏప్రిల్ 1 విడుదల’, ‘చెట్టుకింద ప్లీడర్’, ‘లేడీస్ టైలర్’ వంటి చిత్రాలే కాకుండా ఈ మధ్య వచ్చిన ‘గోపి గోపిక గోదావరి’ వంటి పలు చిత్రాలు అటు ప్రేమ, ఇటు ఎంటర్ టైన్మెంట్ రెండింటిని జతచేసి వంశీ తనదైన శైలిలో సినిమాలు తీస్తుంటారు.

అయితే ఈ మధ్య అయిన సినిమాలు ఒక్కటి కూడా విడుదలవ్వట్లేదు. వంశీ దర్శకత్వంలో ఇటీవలే ‘తను మొన్నే వెళ్లిపోయింది’ చిత్రం రూపొందింది. ఈ చిత్రం దాదాపు 70% షూటింగ్ పూర్తయ్యాక కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇపుడు మళ్లీ అదే సినిమాకు కొత్త పేరును పెట్టి విడుదల చేస్తున్నారు.

ఈ ఆగిపోయిన ‘తను మొన్నే వెళ్లిపోయింది’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. వెంకటేష్ మిగతా భాగాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘మెల్లగా తట్టింది మనసు తలుపు’ అనే పేరుతో మార్చేసి విడుదల చేస్తున్నారు.

అజ్మల్, నిఖితా నారాయణ్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mellagaa Thattindi Manasu Talupu  trailers  songs  videos  stills  posters  

Other Articles