Nitya menon | hot comments | dating

Actress nitya menon hot comments on dating

nitya menon comments on dating, nitya menon latest news, nitya menon movie news, nitya menon movie updates, nitya menon dating comments, nitya menon hot comments, nitya menon latest updates, nitya menon hot stills, nitya menon

Actress Nitya menon hot comments on dating: actress nitya menon shocking comments on dating. nitya menon latest news, movies, gossips, updates, stills, posters, gallery.

అయ్యో బంగారం.. నువ్వేనా అలాంటి మాటలు అనేది?

Posted: 06/04/2015 01:04 PM IST
Actress nitya menon hot comments on dating

సౌత్ సినీ ఇండస్ట్రీలోని గ్లామర్ హీరోయిన్లు, అందాల ఆరబోతల భామలు సెక్స్ గురించి సహజీవనం గురించి మాట్లాడారంటే కాస్త ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ గ్లామర్ కు దూరంగా వుంటూ, విజయాలకు దగ్గరగా వుండే స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ నోటి వెంట సహజీవనం తప్పేంకాదు అనే మాటలు వస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

నిత్యామీనన్ ఇటీవలే ‘ఓకే బంగారం’ సినిమాలో పెళ్లికాకుండానే ప్రేమించిన వాడితో సహజీవనం చేసే ప్రేయసిగా నటించింది. ఈ విషయంపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో.. నిజ జీవితంలో పెళ్లికాకుండానే సహజీవనం చేయడం తప్పుకాదా అనే ప్రశ్నను ఆమె ముందుంచారు ఓ జర్నలిస్ట్. దీనికి నిత్యామీనన్ ఘాటైన సమాధానమిచ్చి, అందరికి షాకిచ్చింది.

ఈ విషయంపై నిత్యామీనన్ స్పందిస్తూ.. పెళ్లికి ముందే నచ్చినవాడితో సహజీవనం చేయడంలో తప్పేం కనిపించడంలేదని చెప్పుకొచ్చింది. ఎవరో పరిచయం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని, సర్దుకుపోయి జీవించడం కంటే, ముందుగానే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదని తెలిపింది. అయినా ఈరోజుల్లో పెళ్లికి ముందు సహజీవనం చేయడం అనేది పెద్ద విషయమేమి కాదని, పైగా ఇలాంటి విషయాల్లో యువత స్వేచ్ఛ కోరుకుంటున్నారని, అందుకు తల్లితండ్రులు కూడా అంగీకరిస్తున్నారని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.

నిత్యామీనన్ కామెంట్లకు ఈ అమ్మడి అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క చిత్రంలో కూడా ఎక్స్ పోజింగ్ చేయకుండా, గ్లామర్ పాత్రలో నటించకుండా కేవలం నటిగా తనను తాను నిరూపించుకున్న నిత్యామీనన్... సడెన్ గా ఇలా సహజీవనం చేయడం తప్పేంకాదంటూ కామెంట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitya menon  hot comments  dating  movie news  

Other Articles