Linga distributers | Rajinikanth | kollywood news

Linga film distributers agian faced problems

Linga distributers, Linga distributers news, Linga distributers press meet, Linga movie latest news, Linga news, Linga film updates, Linga film issue, Linga

Linga film distributers agian faced problems: Rajinikanth lingaa film distributers agian faced problems. kalaipuli s thanu, Rajinikanth.

ఈనెల 13న రజనీకాంత్ ఇంటి ముందు ఆందోళన

Posted: 06/04/2015 11:34 AM IST
Linga film distributers agian faced problems

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘లింగ’ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి తీసుకున్న డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో డిస్టిబ్యూటర్లు అందరూ కూడా తమకు న్యాయం చేయాలంటూ ‘లింగ’ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ను కోరారు. రాక్ లైన్ వెంకటేష్ కుదరదనే సరికి సమస్య మరింత తీవ్రతరమయ్యింది.

దీంతో చివరికి తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్‌థాను, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఈ విషయంపై మాట్లాడి ‘లింగ’ చిత్ర సమస్యను పరిష్కరించారు. అలాగే చివరకు హీరో రజనీకాంత్ కూడా ఈ విషయంపై కలుగచేసుకుని రూ.12.5కోట్లు నష్టపరిహారంగా చెల్లించారు. కానీ ఆ డబ్బు తమకు అందలేదంటూ డిస్టిబ్యూటర్లు మళ్లీ గోల గోల చేస్తున్నారు.

ఈ విషయంపై తాజాగా ‘లింగ’ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ... ‘లింగ’ చిత్ర నష్టపరిహారం విషయంలో తమకు మోసం జరిగిందని, కలైపులి ఎస్.థాను తదితరులు తమను నమ్మించి మోసం చేసారని ఆరోపించారు. వారంలోపు ఎంజీ విధానంపై ‘లింగ’ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించకపోతే 13వ తేదిన రజనీకాంత్ ఇంటి ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే కలైపులి ఎస్.థాను నిర్మించే చిత్రాలకు తాము సహకరించమని వారు స్పష్టం చేసారు.

మరి ఈ ‘లింగ’ వివాదం ఇంకెంత కాలం కొనసాగుతుందో, ఈ విషయంపై ‘లింగ’ చిత్ర దర్శకనిర్మాతలు, హీరో రజనీకాంత్ ఎలా స్పందించనున్నారో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Linga  distributers  Rajinikanth  kollywood news  

Other Articles