Ram charan | new film shooting updates

Ram charan new film shooting updates

Ram charan latest movie shooting updates, Ram charan latest movie shooting details, Ram charan movie news, Ram charan movie updates, Ram charan stills, Ram charan latest stills, Ram charan, Rakul Preet singh

Ram charan new film shooting updates: Ram charan upcoming film under srinu vaitla direction. DVV Danayya direction. Rakul preet singh heroine, Thaman SS Music.

రాంచరణ్ కొత్త సినిమా తాజా విశేషాలు

Posted: 06/03/2015 03:03 PM IST
Ram charan new film shooting updates

శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ నేటి నుంచి (3 rd జూన్) హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన తొలిసారిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ.... గత నెల 21 నుంచి 30 వరకు మెగాపవర్ స్టార్ రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై యూరప్ లో పాటల చిత్రీకరణ జరిగింది. తిరిగి ఈరోజు నుంచి హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. రాంచరణ్ తో పాటు కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, రావురమేష్, పవిత్రలోకేష్, సప్తగిరి, రవిప్రకాష్ ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ‘నాయక్’ తర్వాత రాంచరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబవుతుందని అన్నారు.

అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ... ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ కథా చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఘన విజయం పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం; తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, స్టంట్స్: అనల్ అరసు.; సమర్పణ : డి. పార్వతి,; నిర్మాత : దానయ్య డి.వి.వి., మూలకథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ్రీను వైట్ల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Rakul preeth singh  movie news  stills  

Other Articles