Andhra Pori Movie | title court issue

Andhra pori movie title court issue

Andhra Pori Movie title issue, Andhra Pori Movie issue, Andhra Pori Movie latest news, Andhra Pori Movie updates, Andhra Pori Movie trailers, Andhra Pori Movie songs, Andhra Pori Movie audio, Andhra Pori Movie

Andhra Pori Movie title court issue: Akash puri latest film andhra pori. Ulka gupta heroine. this film title issue news

వివాదాల్లో ఆంధ్రాపోరీ టైటిల్... నేడే కోర్టు తీర్పు!

Posted: 06/03/2015 12:04 PM IST
Andhra pori movie title court issue

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆంధ్రాపోరీ’. ఈ చిత్ర టైటిల్ ప్రస్తుతం వివాదాల్లో నిలిచింది. ఆంధ్రా, తెలంగాణ అంటూ రెండు రాష్ట్రాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ‘ఆంధ్రాపోరీ’ అనే టైటిల్ వలన తమ మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కొంత మంది ఈ సినిమా టైటిల్ పై కేసు వేసారు.

ఈ కేసుపై నేడు కోర్టు విచారణ జరుపనుంది. ‘ఆంధ్రాపోరీ’ అనే టైటిల్ ను కోర్టు అంగీకరిస్తుందో లేక టైటిల్ మార్చవలసి వస్తుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది. ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమాకే ఈ విధంగా వివాదం రేగడంతో ఈ సినిమా గురించి తెలియనివారికి కూడా బాగా చేరువయ్యిందని చెప్పుకోవచ్చు.

ఆకాష్ పూరీ, ఉల్కా గుప్తా జంటగా నటించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలయ్యింది. పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. మాస్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ టైటిల్ వివాదంపై కోర్టు ఎలాంటి తీర్పునివ్వనుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pori  Akash puri  trailer  release date  

Other Articles