nandamuri kalyan ram junior ntr project will start vakkantham vamsi

Nandamuri kalyan ram junior ntr project will start vakkantham vamsi

nandamuri kalyan ram, junior ntr, jr ntr news, kalyan ram updates, kalyan ram ntr news, vakkantham vamsi news, tollywood gossips, telugu movies, jr ntr movies

nandamuri kalyan ram junior ntr project will start vakkantham vamsi : Finally Finally nandamuri brothers kalyan ram and junior ntr combinely making a project which will go on floors from october month. Vakkantham vamsi will direct this movie.

అన్నాదమ్ముల అనుబంధం.. వెండితెరపై ‘బృందావనం’

Posted: 06/01/2015 10:20 AM IST
Nandamuri kalyan ram junior ntr project will start vakkantham vamsi

నందమూరి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ఒక్క చిత్రంలోనూ నటించలేదు. కనీసం గెస్ట్ పాత్రల్లో సైతం వీరు నటించలేదు. అయితే.. ఇప్పుడు ఈ అన్నాదమ్ములిద్దరూ కలిసి వెండితెరపై ‘బృందావనం’ పండించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం! త్వరలోనే ఈ నందమూరి హీరోలు ఓ ప్రాజెక్ట్ కోసం జడకడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరూ హీరోలు కలిసి ఓ చిత్రాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇండస్ట్రీ న్యూస్!

అయితే.. ఈ సినిమాలో ఒక హీరో వెండితెరపై మ్యాజిక్ చేయగా.. మరొకరు తెరవెనుక వుంటూ రంగులు పూయనున్నారు. అంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఎప్పుడో సినిమా చేయాల్సి వుండేది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ అది ఆ మూవీకి సంబంధించిన పనులు జరుగుతూనే వున్నాయి. ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు.. ఈ సినిమాకి కావాల్సిన నటీనటుల ఎంపిక కూడా ఇప్పటినుంచే స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక పాత్రకు తగ్గట్టు స్టార్ హీరోయిన్ నే ఈ చిత్రంలో తీసుకోవాలని యూనిట్ నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు. అక్టోబర్ నెల నుంచి ఈ సినిమా సెట్స్ సైకి వెళుతుందని.. అక్కడి నుంచి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా లేదా మార్చిలో విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. చివరికీ నందమూరీ అన్నాదమ్ములు ఈ విధంగా కలవడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandamuri kalyan ram  jr ntr  vakkantham vamsi  

Other Articles