Malli Malli Idi Rani Roju | Nee Naan Naam | Nithya menon | Sharwanand

Malli malli idi rani roju dubbed into kollywood

Malli Malli Idi Rani Roju dubbed in tamil, Malli Malli Idi Rani Roju tamil dubbing, Malli Malli Idi Rani Roju tamil movie, Nee Naan Naam movie news, Nee Naan Naam movie release date, Nee Naan Naam movie updates, Nee Naan Naam posters, Nee Naan Naam trailers

Malli Malli Idi Rani Roju dubbed into kollywood: Nithya menon and Sharwanand latest hit film Malli Malli Idi Rani Roju dubbed in to tamil version. tamil movie title Nee Naan Naam.

తమిళంలోకి నిత్యా, శర్వాల ప్రేమరోజు

Posted: 05/27/2015 09:57 AM IST
Malli malli idi rani roju dubbed into kollywood

క్యూట్ జోడి నిత్యామీనన్, శర్వానంద్ జంటగా నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఉత్తమ చిత్రంగా భారీ ప్రశంసలు అందుకుంది. బ్యూటీఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గోపిసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలోని ‘మర్హబా’ అనే పాట ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే వుంది. గుండెకు హత్తుకునే చక్కటి ప్రేమకథా చిత్రంగా రూపొందిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ త్వరలోనే తమిళంలోకి కూడా వెళ్లనుంది.

తమిళంలో ఈ చిత్రాన్ని ‘నీ నాన్ నామ్’(నువ్వు నేను మనం) అనే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. తమిళంలో నిత్యామీనన్ కు మంచి ఫాలోయింగ్, మార్కెట్ కూడా వుంది. అలాగే శర్వాకు కూడా తమిళంలో మంచి ఇమేజ్ వుంది. ఇటీవలే నిత్యామీనన్ నటించిన ‘ఓకే బంగారం’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

కాబట్టి ఈ ‘నీ నాన్ నామ్’ చిత్రం కూడా తమిళంలో మంచి విజయం సాధించనుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నారు. మరి తమిళంలో ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malli Malli Idi Rani Roju  Nee Naan Naam  Nithya menon  Sharwanand  

Other Articles