Jackie Chan | death rumors

Actor jackie chan clarifies on his death news

Jackie Chan latest news, Jackie Chan latest tweets, Jackie Chan tweets, Jackie Chan news, Jackie Chan stills, Jackie Chan death news, Jackie Chan gossips, Jackie Chan

Actor Jackie chan clarifies on his death news: Film star Jackie Chan clarifies on his death news, rumors and gossips. Jackie Chan latest tweets, news, gossips, gallery.

బాబోయ్ నేను చావలేదు.. బ్రతికే వున్నాను!

Posted: 05/19/2015 11:47 AM IST
Actor jackie chan clarifies on his death news

సినిమాల్లో ఏదైనా ఫైటింగ్ సీన్ వచ్చినా కూడా అందరూ కూడా యాక్షన్ హీరో జాకీచాన్ వలె ఫీలైపోతుంటారు. గాలిలోకి ఎగిరెగిరి తన్నాలని తెగ ప్రయత్నిస్తుంటారు. కానీ ఎక్కడా....  సినిమాల్లో అంతా డూపే.. రియల్ లైఫ్ లో కూడా అది అసాధ్యమే.

అలాంటి జాకీచాన్ చనిపోయాడని హాలీవుడ్ లోని పలు పత్రికలు ప్రచురించాయి. ఈ వార్తతో జాకీచాన్ అభిమానులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. జాకీచాన్ కు ఏమైందోనని అభిమానులు అందోళన చెందుతున్నారు. జాకీచాన్ విమాన ప్రమాదంలో మరణించాడంటూ వచ్చిన వార్తలపై చివరికి జాకీచానే స్పందించకతప్పలేదు.

ఈ విషయంపై జాకీచాన్ స్పందిస్తూ... తాను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా వున్నానని, తాను విమాన ప్రమాదంలో చనిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. ఆ వార్తలు చూసి తానే షాకయ్యానని జాకీచాన్ తెలియజేసారు.

జాకీచాన్ ఈ విషయంపై స్పందించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా తన గురించి ఇతర సోషల్ మీడియాలో వస్తున్నవార్తలను నమ్మవద్దని, తన వివరాలకోసం తన అఫీషియల్ వైబ్ పేజీని మాత్రమే ఫాలో అవ్వమని జాకీచాన్ కోరాడు.ప్రస్తుతం జాకీచాన్ కేన్స్ లో జరుగుతున్న 68వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బిజీగా వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jackie Chan  Clarifies  death rumors  stills  

Other Articles