Porkalathil Oru Poo | Censor Problems | Release Date

Porkalathil oru poo movie censor details

Porkalathil Oru Poo Movie Censor, Porkalathil Oru Poo Censor Problems, Porkalathil Oru Poo movie stills, Porkalathil Oru Poo news, Porkalathil Oru Poo songs, Porkalathil Oru Poo trailers, Porkalathil Oru Poo videos, Porkalathil Oru Poo

Porkalathil Oru Poo Movie Censor Details: Tamil movie Porkalathil Oru Poo. This Movie Censor Problems. Porkalathil Oru Poo movie news, gossips, details, updates, stills, gallery.

సినిమా చూసి సర్టిఫికెట్ ఇవ్వట్లేదట!

Posted: 05/19/2015 10:48 AM IST
Porkalathil oru poo movie censor details

తమిళులకు ‘శ్రీలంక’ పేరు వినిపిస్తేనే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అలాంటిది శ్రీలంకలో ఓ ఆడపడుచును ఘోరంగా హింసించి, హతమార్చిన వైనాన్ని సినిమాగా తీస్తే ఇంకెంత ఆగ్రహం వ్యక్తం చేస్తారో మీరే ఊహించుకోండి. ప్రస్తుతం కోలీవుడ్ లో అలాంటి పరిస్థితే ఏర్పడింది. తాజాగా ఓ తమిళ సినిమాకు తమిళ సెన్సార్ బోర్డు వారు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.

అందుకు గల కారణం ఏమిటంటే... తమిళంలో తాజాగా ‘పోర్కలాతిల్ ఒరు పూ’ అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో శ్రీలంకలో జరిగిన యుద్ధంలో ఎల్టీటీఈ తరపు సమాచారాన్ని అందించే ఒక టీవీ జర్నలిస్ట్ ప్రియ అక్కడికి వెళ్తుంది. అక్కడ ప్రియను శ్రీలంక సైనికులు ఘోరాతీ ఘోరంగా హింసించి, హత్య చేసే కథాంశంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కె.గణేశన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గురునాథ్ సల్సాని నిర్మించారు. సెన్సార్ తీరుపై దర్శకుడు స్పందిస్తూ... సెన్సార్ వారు అడిగిన అన్ని ప్రశ్నలకు బదులిచ్చామని, అయినా కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా విడుదల చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమాకు సెన్సారు వారు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో చూడాలి. మొత్తానికి సినిమాకు కావాలసిన భారీ ప్రమోషన్ ఈ విధంగానైనా జరిగిపోయింది. మరి ఈ సినిమా తమిళంలో ఎలాంటి ఆదరణ పొందనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Porkalathil Oru Poo  Censor Problems  Release Date  

Other Articles