Sudheer Babu | Mosagallaku Mosagaadu | Release date

Sudheer babu mosagallaku mosagaadu release date

Mosagallaku Mosagaadu Release Date, Mosagallaku Mosagaadu Teaser, Mosagallaku Mosagaadu First Look Poster, Sudheer Babu ‎Mosagallaku Mosagaadu First Look, Sudheer Babu ‎Mosagallaku Mosagaadu Poster, Mosagallaku Mosagaadu Movie First Look, Mosagallaku Mosagaadu Poster, Mosagallaku Mosagaadu movie stills, Mosagallaku Mosagaadu movie news, Sudheer babu Mosagallaku Mosagaadu, Sudheer babu Mosagallaku Mosagaadu poster

Sudheer babu Mosagallaku Mosagaadu Release Date: Sudheer Babu, Nandini Babu latest movie Mosagallaku Mosagaadu. direction Bose nelluri. under Lakshmi Narasimha Entertainments of Swamy Ra Ra fame.

మరో నాలుగు రోజుల్లో మోసగాళ్లకు మోసగాడు విడుదల

Posted: 05/18/2015 10:20 AM IST
Sudheer babu mosagallaku mosagaadu release date

సుధీర్ బాబు, నందిని జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నాడు. నిఖిల్, స్వాతి జంటగా నటించిన సూపర్ హిట్ ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్ ఈ ‘మోసగాళ్లకు మోసగాడు’.

పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మొదటగా ఈనెల 21న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తన తెలివితేటలతో ఎదుటి వారిని మోసం చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు క్రిష్. ఎలాంటి గోల్ లేని అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Mosagallaku Mosagaadu  Release date  

Other Articles