tollywood celebrities make swachh hyderabad sucessful in filmnagar

Tollywood actors partcipate in swachh hyderabad

tollywood actors, swachh hyderabad, maa president rajendraprasad, ttd member and director raghavendra rao, film nagar society secretary suryanarayana, hero venkatesh, hero rana, hero rajashekar, actress rukul preetsingh, director boyapati srinu, director trivikram srinivas, director surender reddy, comedian venu madhav, actor tanikella bharani, actor vjayachander, actress hema, shivaji raja, uthej, producer c.kalyan

tollywood celebrities heros, actors, renowned directors and producers make swachh hyderabad sucessful in filmnagar

స్వచ్ఛ హైదరాబాద్ కోసం.. తరలిన తారాలోకం..

Posted: 05/17/2015 08:17 PM IST
Tollywood actors partcipate in swachh hyderabad

తెలంగాణ ప్రభుత్వం పిలుపుమేరకు నిత్యం బిజీబిజీగా వుంటే తారాలోకం కదలివచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్వచ్ఛందంగా కదలివచ్చిన తారాలోకం.. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చేసింది. ఆదివారం ఫిలింనగర్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తారాలోకం కదిలివచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సినిమాటోగ్రఫీ శాఖా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ నటులు తమ అభిమానులను స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమను దేశంలోనే నంబర్‌వన్‌గా చేసే బాధ్యత తాను చేపడతానని తలసాని హామీ ఇచ్చారు.

పరిసరాలను, రహదారులను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత స్థానికులదేనని అన్నారు. రూ.25 కోట్లతో మూడేళ్లలో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సినీ హీరోలు వెంకటేష్, రానా, రాజశేఖర్, నటి రకూల్ ప్రీత్‌సింగ్, దర్శకులు కె. రాఘవేందర్‌రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, నటులు వేణుమాధవ్, తనికెళ్ల భరణి, విజయ్‌చందర్, హేమ, శివాజీరాజా, ఉత్తేజ్, నిర్మాత సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood actors  swachh hyderabad  telangana government  

Other Articles