Chiranjeevi Auto Johnny | Movie news

Chiranjeevi talks about his 150 film

Chiranjeevi Talks about his 150 Movie, Ram charan Talks about Chiranjeevi 150 Movie, Ram charan interview, Ram charan latest news, Ram charan movie news, Ram charan movie updates, Ram charan latest stills, Ram charan latest details, Ram charan stills, Ram charan

Chiranjeevi Talks about his 150 film: Megastar Chiranjeevi 150th film Title Auto johnny. Puri jagannadh direction. Ram charan producer.

చిరు చెప్పిన ఆటోజానీ విశేషాలు

Posted: 05/16/2015 04:20 PM IST
Chiranjeevi talks about his 150 film

గతకొద్ది కాలంగా వినిపిస్తున్న వార్తలు గతకొద్ది రోజులుగా మరింత ఎక్కువయ్యాయి. ఇక ఆ వార్తలు రోజురోజుకి మరింత ఉత్కంఠను కలుగజేస్తున్నాయి. అయితే ఈ ఉత్కంఠ కేవలం మెగా అభిమానుల్లో మరింత ఎక్కువగా వుంది. అసలు విషయం ఏమిటంటే... మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ చిత్రం కోసం ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘ఆటోజానీ’ పేరుతో ఈ 150వ చిత్రం తెరకెక్కనుంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై తాజాగా చిరంజీవి ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

ఆగష్టులో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని, అలాగే ఈ చిత్రాన్ని తన తనయుడు రాంచరణ్ తో పాటు బండ్ల గణేష్ లు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారని తెలిపారు. ఇంకా మిగతా వివరాలేమి చెప్పలేదు చిరు. ఈ చిత్రాన్ని చిరు పుట్టినరోజు(ఆగష్టు 22)న ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి కోనవెంకట్, బివిఎస్ఎన్ రవిలు స్ర్కిప్టును సమకూరుస్తున్నారు.

అన్ని లోకేషన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఖరారు అయ్యాక నిరవధికంగా షూటింగ్ జరిపి, కేవలం మూడు నెలలోపే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని పూరీ పక్కాగా ప్లాన్ వేసినట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Auto Johnny  Movie news  Interview  

Other Articles