RGV | Mogalipuvvu | Official Trailer

Mogalipuvvu movie official trailer

Mogalipuvvu Movie Official Trailer, RGV Mogalipuvvu first look, RGV Mogalipuvvu first look, RGV Mogalipuvvu poster, RGV Mogalipuvvu movie poster, RGV Mogalipuvvu look, RGV Mogalipuvvu stills, RGV Mogalipuvvu news, RGV Mogalipuvvu tweets, RGV, Mogalipuvvu first look

Mogalipuvvu Movie Official Trailer: Ram gopal varma latest movie Mogalipuvvu. Every husband has secrets hidden inside his cell phone and If wives can access them, 75% marriages will end .”- A prominent social psychologist.

అంచనాలు పెంచేసిన వర్మ మొగలిపువ్వు ట్రైలర్

Posted: 05/16/2015 01:29 PM IST
Mogalipuvvu movie official trailer

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘మొగలి పువ్వు’ అనే రొమాంటిక్, థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ప్రతి పెళ్లైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్లుంటాయ్ అంటూ పోస్టర్ పై ముద్రించారు. అంతే కాకుండా ఈ సినిమా ఎలా వుండబోతుందో వర్మ తనదైన శైలిలో వివరణ కూడా ఇచ్చుకున్నారు.

‘ప్రతి పెళ్ళైన మగాడూ బయట ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అవుతాడు. ప్రతి భార్య తన భర్తకేదైనా ఒక సీక్రెట్ ఎఫైర్ ఉందేమోనని భయపడుతూ వుంటుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్ లో తన భార్యకి తెలియని సీక్రెట్ లు ఉంటాయి. ఎఫైర్ లు అనేవి పెళ్లి వ్యవస్థ పుట్టినప్పటి నుంచీ వున్నాయి. కాని సెల్ ఫోన్లలో పాస్ వర్డ్ లు, వాట్స్అప్ లు, పేస్ టైం లు కెమెరాలు వగైరా వచ్చినప్పటి నుంచి అవి ఒక భయంకర స్థితికొచ్చేశాయి. టెక్నాలజీయే కాకుండా స్త్రీల పై అత్యాచారాల పరంపరను అరికట్టడానికి కొత్తగా వచ్చిన నిర్భయ లాంటి చట్ట సవరణలు స్త్రీ పురుష సంబంధాలలో భూకంపాలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ తీసుకుని రాసిన కధే మొగలిపువ్వు’ అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే వర్మ ఈసారి హిట్టుకొట్టేట్లుగా వున్నాడు. సీక్రెట్ ఎఫైర్ పై వర్మ తనదైన శైలిలో అద్భుతంగా చూపించబోతున్నట్లుగా అర్థమవుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Mogalipuvvu  Official Trailer  

Other Articles