Tammana | Marriage | movie news

Tammana talks about her marriage gossips

Tammana talks about her marriage, Tammana latest news, Tammana movie news, Tammana movie updates, Tammana stills, Tammana hot news, Tammana latest interview, Tammana news, Tammana gossips, Tammana marriage, Tammana gallery.

Tammana talks about her marriage gossips: Tollywood heroine tamanna talks about her marriage news, rumors, gossips.

అబ్బా మిల్క్ బ్యూటీ... ఆ లిస్ట్ కొంచెం చేప్తావా?

Posted: 05/13/2015 11:56 AM IST
Tammana talks about her marriage gossips

టాలీవుడ్ లో మొన్నటి వరకు మిల్కీ బ్యూటీగా పేరు దక్కించుకున్నతమన్నా... ఆ తర్వాత స్టార్ హీరోల చిత్రంలో నటించి, స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అందం, నటన, డాన్స్ ఈ అమ్మడి ప్రత్యేక లక్షణాలు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయాక తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్లు గడుస్తున్నాయి. అయితే తమన్నా ఈ మధ్య ఎక్కడికెళ్లినా కూడా ఒకటే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. అదెంటంటే.. ‘తమన్నా... మీ పెళ్లి ఎప్పుడు?’. ఈ ప్రశ్నకు తమన్నా తనదైన శైలిలో స్పందించింది.

ఈ ప్రశ్నకు తమన్నా స్పందిస్తూ... తన పెళ్లి గురించి అడగడంలో వారి తప్పేంలేదని, ఎందుకంటే తాను ఇండస్ట్రీకి వచ్చి పది ఏళ్లు గడుస్తున్నాయని.. కాబట్టి ఇదంతా మాములేనని చెబుతోంది. అందుకే తన పెళ్లి గురించి ఇలా వరుసగా ప్రశ్నలు వస్తున్నాయని తెలిపింది. కానీ ప్రస్తుతం తన జీవితంలో తన అమ్మ,నాన్న,అన్నయ్యల ప్రేమ మాత్రమే వుందని, తాను మాత్రం ఇంకెవరినీ ప్రేమించలేదని చెబుతోంది. తాను ప్రేమించగల అర్హత వున్న వ్యక్తి ఇంకా తారసపడలేదని, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుండటం వల్ల ప్రేమించే టైం లేదని.. కానీ నచ్చినవాడు కనిపిస్తే తప్పకుండా ప్రేమిస్తానని తమన్నా చెప్పుకొచ్చింది.

ఇంతకీ తమన్నాకు నచ్చాలంటే ఎలాంటి అర్హత వుండాలో మాత్రం చెప్పలేదు. కనీసం ఆ అర్హతల కోరికల జాబితా చెప్పినా కానీ ఎవరైన ప్రయత్నించేవాళ్లేమో. తమన్నాకు నచ్చే వ్యక్తి ఎక్కడున్నాడో ఏమో తెలియదు కానీ... ఈ అమ్మడు పెళ్లి చేసుకోవాలంటే మరో నాలుగైదు ఏళ్లు ఖచ్చితంగా పడుతుందనేది సినీవర్గాల అంచనా. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ అమ్మడు ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి రెండేళ్లు పడుతుంది. ఇక ఆ తర్వాత ప్రేమ గురించి ఆలోచించిన కూడా.. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లాలంటే మరో ఏడాది సమయం అవుతుంది. కాబట్టి ఒకవేళ పెళ్లి చేసుకుంటే మరో నాలుగేళ్ల తర్వాతనే అని అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రవితేజ సరసన ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న నాగార్జున, కార్తీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తుంది. అదే విధంగా తమన్నా నటించిన ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tammana  Marriage  hot stills  movie news  

Other Articles