Rajamouli | Bahubali | First Look Poster

Baahubali first look poster released

Rajamouli Baahubali release date confirmed, Baahubali trailer release date, Rajamouli Baahubali release date, Baahubali release date confirmed, Baahubali movie news, Baahubali latest news, Baahubali release date fixed, Rajamouli tweets, Rajamouli latest tweets, Rajamouli movie news, Prabhas

Baahubali First Look Poster Released: Director SS Rajamouli Upcoming movie Bahubali. Baahubali First Look Poster Released today. going to release on may 15 grandly.

వామ్మో... బాహుబలి ఫస్ట్ లుక్ సిరిగిపోయిందిపో!

Posted: 05/01/2015 04:34 PM IST
Baahubali first look poster released

తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం మొదలయ్యింది. నేటి(మే 1) నుంచి ఒక్కోరోజు ఒక్కో విధంగా దాడి చేయనుంది. ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? ‘బాహుబలి’ ప్రమోషన్స్ దాడి మొదలయ్యింది. ఇక ‘బాహుబలి’ ప్రమోషన్స్ లను ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోండి.

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ మొదటి పార్ట్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మే 1వ తేది నుంచి ప్రారంభించనున్నట్లుగా మీకు ఇదివరకే తెలియజేసాం. అయితే ‘బాహుబలి’ తన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేసింది. తాజాగా ‘బాహుబలి’కి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ చూస్తుంటే... ‘వారెవ్వా...’ అని అనిపించేలా వుంది. కేవలం ఫోటో విజువల్స్ పరంగానే ఈ రేంజులో వుంటే ఇక సినిమా ఏ రేంజులో వుండనుందో మీరే ఊహించుకోండి. ఇక ఈరోజు నుంచి మే 31 వరకు వరుసగా నెలరోజుల పాటు ‘బాహుబలి’ ప్రమోషన్స్ కార్యక్రమాలు భారీగా జరుగనున్నాయి.

ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను మే 31న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జులై నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Baahubali-First-Poster-2

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Bahubali  First Look Poster  Release date  

Other Articles