కాజల్ అగర్వాల్ కి తెలుగులో ఆఫర్లు లేని నేపథ్యంలో అమ్మడు తమిళనాడుకి మకాం మార్చిన విషయం విదితమే! మొదట అక్కడ కూడా మూవీ ఆఫర్ల కోసం కాస్త చక్కర్లు కొట్టింది కానీ.. అనంతరం ధనుష్, విశాల్ సరసన హీరోయిన్ గా రెండు భారీ అవకాశాలను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ రెండు మూవీ షూటింగులతో కాజల్ బిజీగా గడుపుతోంది. అయితే.. ఇంతలోనే ఈమెకి సంబంధించి మరో వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ‘ఎవరికీ అర్థం కాని మనిషి’ ఒడిలో చేరి ఈ భామ రొమాన్స్ చేస్తోందని ప్రచారం కొనసాగుతోంది. ఇంతకీ ఆ మనిషి ఎవరు..? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన స్టార్ హీరో చియాన్ విక్రమ్.
వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో విక్రమ్ హీరోగా మురుగదాస్ శిష్యుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘మర్మ మణితన్’ (ఎవరికీ అర్థం కాని మనిషి) అనే ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ మూవీలో హీరోయిన్ కోసం ఎందరో భామలను పరిశీలించారు. ఈ క్రమంలోనే కాజల్ ని సంప్రదించగా ఆమె ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఒప్పేసుకుంది. తెలుగులో ఆఫర్లు లేకుండా సతమతమవుతున్న నేపథ్యంలో ఇంత భారీ ప్రాజెక్ట్ తనకు దక్కడంతో అమ్మడు సంతోషం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా.. విక్రమ్ లాంటి విలక్షణ నటుడితో నటించడం విషయంలో కాజల్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కలైపులి థాను నిర్మించనున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ త్వరలోనే మలేషియాలో మొదలుకానుంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more