mahesh babu Latest flick srimanthudu shooting getting late | malaysia schedule updates

Mahesh babu koratala siva srimanthudu shooting malaysia schedule updates

mahesh babu news, mahesh babu gossips, mahesh babu photos, mahesh babu updates, mahesh babu srimanthudu, mahesh babu movies, mahesh babu koratala siva, shruti hassan, shruti hassan controversies, srimanthudu malaysia

mahesh babu koratala siva srimanthudu shooting malaysia schedule updates : According to the tollywood sources.. Mahesh babu, koratala siva latest flick movie shooting malaysia schedule is getting late due to some reasons. so that the shoot will run their till may 2.

మహేష్ అభిమానులకు ‘చేదువార్త’!

Posted: 04/23/2015 11:04 AM IST
Mahesh babu koratala siva srimanthudu shooting malaysia schedule updates

మహేష్ బాబు అభిమానులకు ఓ చిన్న చేదువార్త! ‘ఆగడు’ ఆగమైన తర్వాత ఆయన తదుపరి చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని వెయిట్ చేస్తున్న అభిమానులు అలాగే మరికొన్నాళ్లపాటు వెయిట్ చేయక తప్పదు. సమ్మర్ లోనే ఈయన మూవీ రిలీజ్ అవుతుందని అంతా భావించారు కానీ.. ఆ భావనలిప్పుడు బోల్తాపడ్డాయి. ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతున్న క్రమంలో రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశముందని వార్తలొస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మహేష్ హీరోగా ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం విదితమే! ఈ సినిమాకి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా.. ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ శరవేగంగానే జరిగింది. చకచకా షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ఈ మూవీ యూనిట్ ఇటీవలే మలేషియాకు బయలుదేరింది కూడా! గత 15 రోజులుగా అక్కడే షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడే మహేష్ బాబు, శృతి హాసన్, జగపతి బాబు, సుకన్య మిగిలిన కీలక నటీనటులపై కొన్ని కీలకమైన ఫ్యామిలీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. అయితే.. ముందుగా అనుకున్నట్లు ఈ మూవీ చిత్రీకరణ ముందుగా ఈ షెడ్యూల్ ని 22 కల్లా పూర్తి అవ్వాల్సి వుండేది. కానీ.. కొన్ని షూటింగ్ సమయంలో కొన్ని అనివార్య కారణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ మరో పది రోజులు మలేషియాలోనే జరగనుందని సమాచారం!

ఈ మూవీ బృందం చెప్పిన సమాచారం ప్రకారం.. మే 2 వరకూ ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుంది. ఈ మలేషియా ఎపిసోడ్ సినిమాకి చాలా కీలకం కావడం వల్ల షూటింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ని కట్టిపడేసేలా రూపొందిస్తున్నారని, అందుకే షూటింగ్ జాప్యం అవుతుందని వెల్లడిస్తున్నారు. అక్కడ షూటింగ్ ముగియగానే మే 3న ఈ చిత్ర తిరిగి హైదరాబాద్ చేరుకుని.. ఇక్కడ లేటెస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నట్లు చెబుతున్నారు. ఇదిలావుండగా.. ఇందులో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరోవైపు.. ఈ సినిమా షూటింగ్ ని త్వరగా ముగించేసి జూలై 17న రిలీజ్ చెయ్యడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. మలేషియా షెడ్యూల్ షూటింగ్ ఆలస్యం కావడంతో తదుపరి షెడ్యూల్స్ చిత్రీకరణల్లో కూడా మార్పులు చేయాల్సి వుంటుందని.. తద్వారా షూటింగ్ ఆలస్యం అవుతోందని కాబట్టి అనుకున్న తేదీకి మూవీ రిలీజ్ కాకపోవచ్చునని అంటున్నారు. ఈ చిక్కుముడి విడవాలంటే.. దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేయాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  koratala siva  srimanthudu movie  shruti hassan  

Other Articles