Difference between Actress sona and director prabhu | Tamil Producers Association

Actress sona complaints on director venkat prabhu

actress sona, actress sona controversy, sona controversies, tamil sona news, sona venkat prabhu news, actress sona latest updates, venkat prabhu controversy, tamil movie association

actress sona complaints on director venkat prabhu : actress sona complaints on director venkat prabhu to give back her remuneration which she has given to him in 2009 for movie.

దర్శకుడి బండారం బయటపెట్టిన హాట్ ఆంటీ

Posted: 04/20/2015 12:32 PM IST
Actress sona complaints on director venkat prabhu

సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యంగా, నమ్మశక్యం కానివిగా వుంటాయి. ముఖ్యంగా తారలు, దర్శకుల మధ్య జరిగే వివాదాలు చాలా విచిత్రంగా వుంటాయి. ఏదైనా సినిమా చేయడానికి ముందు వారు చేసుకునే ఒప్పందాలు తర్వాత కుదరక.. మొన్నటివరకు వున్న వారి స్నేహాన్ని ఒక్కసారిగా శతృత్వంగా మార్చేసుకుంటారు. ఒకరిపై మరొకరు అపనిందలు, విమర్శలు చేసుకోవడం లాంటివి నిత్యం జరుగుతూనే వుంటాయి. ఇటువంటి వివాదమే మాజీ నటి, ఓ మాస్ దర్శకుడి మధ్య రాజుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా కొనసాగిన నటి సోనా వివాహానంతరం ఇండస్ట్రీకి దూరమైంది. కొన్నాళ్ల తర్వాత తిరిగి కొన్ని సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు నిర్మాతగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె ‘సోనా యూనిట్ ప్రొడక్షన్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇక ఏదైనా సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈమె ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒప్పందం కుదుర్చుకుంది. తనకు ఓ సినిమా తీయాలని వుందని, తన నిర్మాణ సంస్థలో ఓ మూవీని తెరకెక్కించాలని ఆమె 2009లో ఆ డైరెక్టర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పుడే ఆ ప్రాజెక్టుకు ప్రారంభమైంది కూడా! ఆ సినిమా కోసం ప్రభుకు రెమ్యునరేషన్ గా సోనా కోటిన్నర ఇచ్చారట. అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభు ఆ సినిమా చేయలేదు.

దీంతో తన వద్ద తీసుకున్న పారితోషకాన్ని తిరిగి చెల్లించాలని సోనా గతంలోనే ప్రభుకి కోరిందట. అయితే.. ప్రభు మాత్రం ఆ మొత్తాన్ని ఇంతవరకూ ఆమెకు చెల్లించలేదట! ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ విషయంపై తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘంలో సోనా ఫిర్యాదు చేసారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ ఆమె వారిని కోరింది. ఆమె ఫిర్యాదుపై మండలి సభ్యులు ఇటివలే చర్చలు జరిపారు. చర్చల అనంతరం మే నెలలోపు సోనాకు కోటి రూపాయలు తిరిగి చెల్లించాలని సంఘం నేతలు వెంకట్ ప్రభుని ఆదేశించినట్లుగా తెలిసింది. మరి ఈ విషయంపై వెంకట్ ప్రభు ఎలా స్పందిస్తాడో చూడాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress sona  director venkat prabhu  tamil movie association  

Other Articles