Sholay | Cinema | Pakistan | India

Sholay cinema released in pakistan and collcting new records there

sholay, sholay cinema, amitabha sholay, pakistan, indian cinema, sholay updates, sholay news, sholay latest news, sholay records,

Sholay cinema released in pakistan and collcting new records there. Sholay cinema released in india 1975.

పాకిస్థాన్ లో దుమ్మురేపుతున్న షోలే

Posted: 04/19/2015 05:32 PM IST
Sholay cinema released in pakistan and collcting new records there

షోలే’… ఇది రెండు అక్షరాలు కాదు.. భారత సినిమా చరిత్రలో రికార్డులు తిరగరాయడం కాదు కొత్త రికార్డులు సొంతం చేసుకున్న సినిమా. 1975 ఆగస్ట్‌ 15న రిలీజైన ‘షోలే’ భారతీయ చలన చిత్రసీమని ఓ ఊపు ఊపేసింది. యాక్షన్‌ అడ్వంచర్‌గా ఈ చిత్రం క్రియేట్‌ చేసిన రికార్డుల్ని ఇప్పటిదాకా మరో చిత్రం బ్రేక్‌ చేయలేదంటే ‘షోలే’ స్టామినా ఏంటో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడీ సినిమా గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. సినిమా విడుదలై 40 సంవత్సరాలు పూర్తయిందే అంతేకాకుండా  పాకిస్తాన్‌లో ఈ సినిమా తొలిసారిగా విడుదలైంది. భారత్ లో రికార్డుల వరద సృష్టించి ఇండియన్ సినిమా స్టెమినాను చూపించిన షోలే పాక్ లో విడుదలపై మరింత వివరాలు మీకోసం..

‘షోలే’ చిత్రం భారత్‌లో రిలీజై దాదాపు 40 సంవత్సరావుతోంది. ఎన్నో దేశాల్లో ఈ సినిమా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతటి విజయం సాధించిన ఈ చిత్రం ఇంతవరకు పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. అంతకుముందు ఎన్నో భారతీయ సినిమాలు పాకిస్తాన్‌లో రిలీజైనా ‘షోలే’ని విడుదల చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. దీని వెనక కారణాలు తెలియదుగానీ తాజాగా పాక్‌లోని వన్‌ ఆఫ్‌ ది టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌ నదీమ్‌ మండ్వీవాలా ‘షోలే’ని రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారు. అనుకున్నదే తడవుగా ఈనెల 17న ఈ చిత్రాన్ని పాక్‌ థియేటర్లలో 2డీ, 3డీ ఫార్మాట్‌లో విడుదల చేశారు. అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత దాయాది దేశంలో ‘షోలే’ రిలీజ్ అయిందన్నమాట. అమితాబ్‌, ధర్మేంద్ర, సంజీవ్‌కుమార్‌, హేమమాలిని, జయబాధురి, అంజాద్‌ఖాన్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఆర్‌.డి.బర్మన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని జి.పి.సిప్పీ నిర్మించగా రమేష్‌ సిప్పీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్‌ చేసిన ‘షోలే’ పాక్‌లో కూడా తడాఖా చూపిస్తోందట. రెండు రోజుల క్రితం రిలీజైన ఈ మూవీ హౌస్‌ఫుల్‌ బోర్డులతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. అయినా రికార్డులు షేక్ చెయ్యడం రికార్డ్ స్థాయిలో వసూలు రాబట్టడం షోలే ఇప్పుడే కాదు 40 ఏళ్ల కిందే చేసింది. తాజాగా దాయాది దేశంలోనూ సత్తా చాటుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles