Son of Satyamurthy | malayalam version | release date | Mallu Arjun

Son of satyamurthy malayalam version release date

Son of Satyamurthy malayalam version, Son of Satyamurthy malayalam release date, Son of Satyamurthy movie latest news, Son of Satyamurthy movie updates, Son of Satyamurthy movie songs, Son of Satyamurthy movie trailers, Son of Satyamurthy movie teasers, Son of Satyamurthy movie audio, Son of Satyamurthy movie posters, Son of Satyamurthy movie

Son of Satyamurthy malayalam version release date: Stylish star allu arjun latest movie son of satyamurthy malayalam version going to release on 24 april. trivikram direction, devi sri prasad music.

ఏప్రిల్ 24న మలయాళ సత్యమూర్తి విడుదల

Posted: 04/16/2015 11:33 AM IST
Son of satyamurthy malayalam version release date

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగులోనే కాకుండా మలయాళంలో ‘మల్లు అర్జున్’ పేరుతో భారీ క్రేజ్ వుంది. బన్నీ నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా మలయాళంలోకి డబ్బింగ్ అయ్యి, విడుదలయ్యాయి. మలయాళ ప్రేక్షకులకు కూడా బన్నీ సినిమాలు నచ్చడంతో... బన్నీకి మలయాళ సినీ ఇండస్ట్రీలో కూడా భారీ మార్కెట్ ఏర్పడింది.

తాజాగా బన్నీ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లు రాబడుతూ, విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మలయాళంలోకి డబ్బింగ్ చేసి, విడుదల చేయనున్నారు. మలయాళంలో కూడా ఇదే పేరుతో విడుదల చేస్తున్నారు.

మలయాళం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాన్ని ఈనెల 24న ఘనంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు అక్కడ కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. మరి సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

బన్నీ సరసన సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Satyamurthy  malayalam version  release date  Mallu Arjun  

Other Articles