బాలీవుడ్ బాద్షా, హీరో షారుక్ ఖాన్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా షారుక్ కు అభిమానులున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వున్న ధనిక సినీ తారల్లో షారుక్ ద్వితీయ స్థానంలో వున్నాడంటూ గతకొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
వరుసగా షారుక్ తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ... భారీగా సంపాదించేస్తున్నాడు అంటూ సినీవర్గాల అభిప్రాయం. కానీ షారుక్ నిజానికి సినిమాలతో కూడా తన డాన్సులతో ఆ డబ్బు సంపాదిస్తున్నాడట. అసలు సినిమాలు కూడా తీయలేని పరిస్థితిలో వుంటే తనకు తన డాన్సే డబ్బులు సంపాదించి పెడుతోందని షారుక్ అంటున్నాడు.
ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా వున్న అధిక సినీ సంపన్నులలో షారుక్ రెండవ స్థానంలో వున్నాడంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై షారుక్ తనదైన శైలిలో స్పందించారు. తాను డబ్బు విషయంలో అత్యధిక సంపన్నున్ని కాదని, కొన్ని కోట్ల మంది అభిమానులు మనసు దోచుకున్న ధనికున్ని మాత్రమేనని.. అదే తనకు నిజమైన సంపద అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే ఇటీవలే తాను నటించిన ‘హ్యాపీ న్యూఇయర్’ చిత్ర షూటింగ్ సమయంలో నిర్మాతలు తనకు ఫోన్ చేసి, అనుకున్న బడ్జెట్ పూర్తిగా అయిపోయిందని... ప్రస్తుతం వారి దగ్గర డబ్బులు కూడా లేవని చెప్పారంట. దీంతో షారుక్ స్పందిస్తూ... పెళ్లిళ్లకు, ప్రత్యేక కార్యక్రమాల్లో డాన్స్ చేసి తాను డబ్బు సమకూరుస్తానని మాటిచ్చాడట. తాను ఇచ్చిన మాటకు తగ్గట్లుగానే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, డాన్స్ చేసి, డబ్బు సంపాదించి ఆ సినిమా చివరి షెడ్యూల్ ను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసామని షారుక్ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత వెంటనే ట్విట్టర్లో తాను ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల్లో రెండవ వ్యక్తినని అంటూ వచ్చిన వార్తలు చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. మొత్తానికి షారుక్ తన సినిమాలతోనే కాకుండా తన స్పెషల్ డాన్సులతో కూడా సంపాదిస్తూ బిజీగా వున్నాడని అర్థమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more