ఒకప్పుడు తన పోర్న్ వీడియోలతో యువతకు పిచ్చెక్కించిన సన్నీలియోన్... ఇపుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఒకప్పుడు నీలి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి అప్పట్లో ఇంతగా క్రేజ్ లేకపోయినా.. బాలీవుడ్ సినిమాల్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్నీలియోన్ నీలిచిత్రాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఇలాంటి పోర్న్ భామకు తల్లిగా అవ్వాలనుందట. ఓ బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది.
గతంలో సన్నీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నా పదహారో ఏటనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్తో తప్పు చేశాను. ఆ తప్పే నా జీవితంలో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. 19యేళ్ల వయసులో పోర్న్ మూవీ ఇండస్ట్రీలో ప్రవేశించాను. మంచో, చెడో పేరు ప్రఖ్యాతులు మాత్రం వచ్చేశాయి. మామూలు సినిమాల్లో నటించడం కష్టమేమీ కాదు. కాస్త అందం, అభినయ సామర్థ్యం ఉంటే చాలు. కానీ పోర్న్ సినిమాలు చేయడం అలాకాదు. చాలా ఇబ్బందులుంటాయి. ఇవి చెప్పుకోలేనివి. అసలు అంతమంది ముందు అలా చేయడానికే ధైర్యం కావాలి. ఎంతో మానసిక దృఢత్వం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. చాలామంది పోర్న్ ఫిలిమ్స్ని ఇష్టంగా చూస్తారు. కానీ... చూసినంత తేలిక కాదు చేయడం అని అంటోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు 41 శృంగార చిత్రాల్లో నటించడమే కాకుండా... 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం కూడా వహించానని చెప్పుకొచ్చింది.
అయితే ఇదంతా మొన్నటి వరకు తన గత అనుభవాల గురించి వివరాలు... అయితే ప్రస్తుతం మాత్రం సన్నీ ఆ పోర్న్ ఇండస్ట్రీకి దూరంగా వుంటూ హీరోయిన్ గా మంచి పాత్రలలో నటిస్తూ.. అందరి చేత శభాష్ అని అనిపించుకుంటూ వుంది. ఇదిలా వుంటే ఇటీవలే ‘ఏప్రిల్ ఫూల్’ సంధర్భంగా ఈ అమ్మడిపై.. ‘సన్నీలియోన్ త్వరలోనే తల్లి కాబోతుంది’ అంటూ వార్తలొచ్చాయి.
అయితే ఈ వార్తలపై సన్నీలియోన్ చాలా సున్నితంగా స్పందించింది. అవన్నీ పుకార్లేనని... కానీ తనకు కూడా తల్లీని కావాలని, ఓ బిడ్డకు జన్మనివాలని వుందంటూ చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుతం నటిగా తాను బిజీగా వున్నానని, వరుసగా ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి... ఇలాంటి సమయంలో తల్లిగా మారి, తన ఈ సినీ కెరీర్ ను పాడుచేసుకోవాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి మాటలను బట్టి చూస్తుంటే తనకు ఆఫర్లు వచ్చినంత కాలం ఇలాగే చేస్తూ... ఇక ఆఫర్లు తగ్గిపోతున్నాయి అనే క్షణంలో తల్లిగా మారడానికి సిద్దపడుతుందో ఏమో మరి. మొత్తానికి ఏప్రిల్ ఫూల్ అంటూ కామెంట్లు చేసినవారికి సన్నీ సున్నితంగా చురక అంటించింది కదూ!
Video Courtesy: T-Series
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more