Son Of Satyamurthy | Promotional Song | Allu Arjun

Son of satyamurthy movie promotional song

Son Of Satyamurthy Promotional Song, Son Of Satyamurthy Release Date, Son Of Satyamurthy movie news, Son Of Satyamurthy movie updates, Son Of Satyamurthy stills, Son Of Satyamurthy movie stills, Son Of Satyamurthy latest stills, Son Of Satyamurthy latest posters, Son Of Satyamurthy trailer, Son Of Satyamurthy songs, Son Of Satyamurthy jukebox, Son Of Satyamurthy posters, Allu arjun

Son Of Satyamurthy Movie Promotional Song: Allu arjun Latest Movie Son Of Satyamurthy. Samantha, Nithya menon, Adha Sharma heroines. Trivikram srinivas Direction, Devisriprasad music.

సన్నాఫ్ సత్యమూర్తి ప్రమోషనల్ సాంగ్... బన్నీ, దేవి చిందులు

Posted: 04/02/2015 10:06 AM IST
Son of satyamurthy movie promotional song

గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో ‘జులాయి’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించలేకపోయినా... మంచి విజయం సాధించింది. ఈ చిత్ర విడుదల సమయంలో ‘పకడో పకడో’ అనే ప్రమోషనల్ సాంగ్ లో బన్నీ, దేవిలు చిందులేసి, సినిమాకు భారీ ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట అప్పట్లో మాంచి హిట్టయ్యింది. వీరి కాంబినేషన్లో తాజాగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మరోసారి బన్నీ, దేవిలు ‘1,2,3,4..’ అంటూ ఓ ప్రమోషనల్ సాంగ్ ను రూపొందించారు. ఈ పాట వినడానికి బాగానే వున్నా... ప్రమోషన్స్ కోసం చేసిన వీరి చిందులు మాత్రం చిరాకుగా అనిపిస్తున్నాయి.

ఏదో ఈవెంట్ లో చేసినట్లుగా సింపుల్ గా చేసేసి.. ప్రమోషన్ సాంగ్ గా విడుదల చేసారు. ఈ ప్రమోషనల్ సాంగ్ టీజర్ మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, నటులు రాజేంద్రప్రసాద్, సింధుతులానీలు కీలక పాత్రల్లో నటించారు.

బన్నీ సరసన సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son Of Satyamurthy  Promotional Song  Teaser  

Other Articles