i cast my vote to whom i trust says senior actor suman

Actor suman on maa elections

senior actor suman, maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema,

i cast my vote to whom i trust says senior actor suman

సంక్షేమాన్నికాంక్షించే వారికే ఓటు వేశా..!

Posted: 03/29/2015 06:40 PM IST
Actor suman on maa elections

ఇద్దరు సీనియర్ కళామ తల్లి బిడ్డల మధ్య హోరాహోరీగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో తనకు నమ్మకమున్న వ్యక్తికి ఓటు వేశానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం మా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మనసుకు నచ్చిన, నమ్మకమున్న వ్యక్తికి తన ఓటు వినియోగించానని చెప్పారు. మీడియా విప్లవం వచ్చిన తరవాత మా ఎన్నికలు ఓటింగ్ వరకు రావడం ఇదే ప్రథమమని అందుకనే మీడియా హైప్ కనబడుతుందన్నారు.

అంతకుముందు ఎన్నికలు అన్ని ఏకగ్రీవంగానే జరిగాయని కాబట్టి మా ఎన్నికలు గురించి మీడియాకు తెలియలేదని చెప్పారు. మా పనితీరుపై స్పందన కోరగా, గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా.. మున్ముందు బాగుందా అనే విషయం తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ప్యానెల్ పనితీరు చూసిన అనంతరం ఏ విషయమైన చెప్పగలమని అన్నారు. అలాగని, గతంలో పనిచేసిన ప్యానెల్ సరిగా పనిచేయలేదని చెప్పబోనని, వారు మంచే చేశారని, వచ్చే కొత్త ప్యానెల్ మరింత బెటర్గా పనిచేస్తుందని తాను భావిస్తున్నానట్లు సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  jayasudha  maa elections  movie arts association  suman  

Other Articles