Son Of Satyamurthy | Allu arjun | Trivikram srinivas

Son of satyamurthy movie promotional song teaser

Son Of Satyamurthy Promotional Song Teaser, Son Of Satyamurthy Release Date, Son Of Satyamurthy movie news, Son Of Satyamurthy movie updates, Son Of Satyamurthy stills, Son Of Satyamurthy movie stills, Son Of Satyamurthy latest stills, Son Of Satyamurthy latest posters, Son Of Satyamurthy trailer, Son Of Satyamurthy songs, Son Of Satyamurthy jukebox, Son Of Satyamurthy posters, Allu arjun

Son Of Satyamurthy Movie Promotional Song Teaser: Allu arjun Latest Movie Son Of Satyamurthy. Samantha, Nithya menon, Adha Sharma heroines. Trivikram srinivas Direction, Devisriprasad music.

సన్నాఫ్ సత్యమూర్తి ప్రమోషనల్ సాంగ్ టీజర్ విడుదల

Posted: 03/28/2015 02:13 PM IST
Son of satyamurthy movie promotional song teaser

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్లో గతంలో ‘జులాయి’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా విడుదల సమయంలో ‘పకడో పకడో..’ అనే సాంగ్ ను ప్రమోషనల్ సాంగ్ గా వాడుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో దేవి, బన్నీలు కలిసి డాన్స్ చేసారు. అయితే మళ్లీ ఇదే కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది. కుటుంబకథా చిత్రంగా రూపొందుతోంది.

ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాలు ఘనంగా చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం బన్నీ, దేవిలపై ఈసారి కూడా ఓ ప్రమోషనల్ సాంగ్ ను షూట్ చేసారు.

ఈ సినిమాలోని ‘1,2,3,4..’ అనే పాటను ప్రమోషనల్ సాంగ్ కోసం వాడుతున్నారు. ఈ పాట మరో నాలుగైదు రోజుల్లో విడుదల కానుంది. ఈ ప్రమోషనల్ సాంగ్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఆ ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

బన్నీ సరసన నిత్యామీనన్, సమంత, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, నటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

Video Courtesy : Release Day

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son Of Satyamurthy  Promotional Song  Teaser  

Other Articles