ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లండన్‌లోని ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంను సందర్శించేవారికి ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ కనువిందు చేయబోతోంది. కత్రినా రూపాన్ని కళ్లముందు ఆవిష్కరించేలా ఆమె మైనపుబొమ్మను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అమితాబ్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ ప్రముఖుల మైనపు బొమ్మలు ఇప్పటికే లండన్ మ్యూజియంలో కొలువుదీరాయి. 2003లో బూమ్ సినిమాతో బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసిన కత్రినా ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2008లో కత్రినా ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్ గా కూడా ఎన్నుకోబడింది. గూగుల్ లో ఎక్కువ మంది వెతికిన సెలబ్రెటీల్లో కత్రినా పేరు ఖచ్చితంగా ఉంటుంది.
అయితే లండన్‌లోని ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియం కత్రినా బొమ్మను చూసిన వారికి చిక్నీ చమేలీ..’, ‘షీలాకీ జవానీ’ పాటలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. షీలా కీ జవానీ అంటూ కుర్రకారును ఊపి, చిక్ నీ చమేలీ పాటతో అందరిని అలరించింది. అయితే బాలీవుడ్‌లోకి రాకముందు కత్రినా చాలాకాలం పాటు లండన్‌లోనే నివసించింది. లండన్ మ్యూజియంలో తన మైనపుబొమ్మను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇది తనకు లభించిన ప్రత్యేక గౌరవం అని అభివర్ణిస్తోంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో అమితాబ్, ఐశ్వర్య,సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్ మైనపుబొమ్మల సరసన తన మైనపు బొమ్మను కూడా ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని కత్రినా అంటోంది. మొత్తానికి బాలీవుడ్ అగ్రనటుల మైనపు బొమ్మల సరసన మరో నటి విగ్రహం వచ్చి చేరింది. కాగా కత్రినా విగ్రహం చాలా స్టైలిష్ గా కనిపిస్తుండటం విశేషం.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more